Sukumar, Buchi Babu: పుష్ప2 కోసం మరో డైరెక్టర్ పని చేస్తున్నారా?

2021 సంవత్సరంలో విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన సినిమా ఏదనే ప్రశ్నకు పుష్ప ది రైజ్ పేరు సమాధానంగా వినిపిస్తుంది. క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చినా ప్రేక్షకులు మాత్రం పుష్ప ది రైజ్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. పుష్ప ది రైజ్ హిందీలో ఏ మాత్రం ప్రమోషన్స్ లేకుండా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇండస్ట్రీ వర్గాలు సైతం షాకయ్యాయి. అయితే పుష్ప ది రూల్ షూటింగ్ ఇప్పటికే మొదలుకావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతోంది.

అయితే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు కూడా పుష్ప ది రూల్ స్క్రిప్ట్ పనుల్లో జోక్యం చేసుకుంటున్నారని తెలుస్తోంది. పుష్ప ది రూల్ సక్సెస్ సాధించడానికి ఈ దర్శకుడు తన వంతు సహాయం చేస్తున్నాడని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో బుచ్చిబాబుకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. అయితే తారక్ తోనే తన తర్వాత సినిమాను తెరకెక్కించాలని భావించిన బుచ్చిబాబు తారక్ మూవీని తెరకెక్కించడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ కోసం బుచ్చిబాబు పని చేస్తే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. పుష్ప ది రూల్ కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడానికి సుకుమార్ ఎంతగానో కష్టపడుతున్నారు. ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తే పాన్ ఇండియా డైరెక్టర్ గా సుకుమార్ రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో సుకుమార్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus