Sukumar, Sai Pallavi: సాయి పల్లవి లేడి పవర్ స్టార్.. సుకుమార్ కామెంట్!

  • February 28, 2022 / 12:04 PM IST

ఇటీవల కాలంలో హీరోయిన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటున్న వారిలో సాయి పల్లవి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా కంటెంట్ ఉంటుంది అని ప్రేక్షకుల్లో కూడా మంచి నమ్మకం ఏర్పడింది. అంతేకాకుండా సాయి పల్లవి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రీసెంట్ గా శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ప్రత్యేకంగా అతిధిగా వచ్చిన సాయి పల్లవి ని చూసి ప్రేక్షకులు ఒక్కసారిగా విజిల్స్ తో ఆమెకు ఘన స్వాగతం పలికారు.

సాయి పల్లవి రేంజ్ ఏమిటో మరోసారి అందరికీ చాలా క్లారిటీ గా అర్థమైంది. ఇక ఆమెకు వస్తున్న రెస్పాన్స్ ని చూసిన సుకుమార్ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ సినిమా ఈవెంట్ కు మరొక అతిథిగా వచ్చిన సుకుమార్ అందరికంటే ఎక్కువగా సాయిపల్లవిని హైలెట్ అయ్యే విధంగా పొగిడేశారు. ఏకంగా ఆమెను లేడీ పవర్ స్టార్ అని సంపాదించడం విశేషం. సాయి పల్లవి మంచి నటి మాత్రమే కాకుండా ఒక బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అని అన్నారు.

అయితే సాయి పల్లవి పేరు ఎత్తగానే ఆడిటోరియంలో ఒక్కసారిగా అభిమానులు గోలగోలగా అరిచేశారు. వారి హడావిడి చేసిన సుకుమార్ కొద్ది సేపటి వరకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేక పోయింది. ఇక సాయి పల్లవి సుక్కు దగ్గరికి వచ్చి ఏదైనా ఉంటే నాతోనే పర్సనల్ గా చెప్పండి అంటూ చెవిలో చెప్పేసింది. దీంతో సుకుమార్ నువ్వు ఒక లేడీ పవర్ స్టార్ అని ప్రశంసలు కురిపించారు. ఒక కమర్షియల్ యాడ్ను కూడా రిజెక్ట్ చేయడం అంటే అంతగా సాధారణ విషయం కాదని మంచి నటిగానే కాకుండా మంచి మనసున్న అమ్మాయి గా కూడా సాయి పల్లవి గుర్తింపు అందుకుంటోంది అని వివరణ ఇచ్చారు.

ఇక ఆ వేడుకకు మరొక హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ప్రత్యేక అతిథిగా వచ్చింది. సాయి పల్లవి క్రేజ్ ను చూసిన కీర్తి సురేష్ అలాగే హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఆశ్చర్యపోయారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus