Sukumar: సుక్కు ఇంట్లో పనిచేసే అమ్మాయి.. సక్సెస్ స్టోరీ విన్నారా?

‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) రిలీజ్ హడావుడిలో ఉన్న దర్శకుడు సుకుమార్ (Sukumar) ఇప్పుడు మరో ప్రత్యేక కారణంతో వార్తల్లో నిలిచారు. ఆ కారణం ఆయన ఇంట్లో పనిచేసే యువతి దివ్య. తక్కువ వయసులోనే తన కష్టంతో మెరిట్‌లో పై చదువులు పూర్తి చేసి, తాజాగా ప్రభుత్వ ఉద్యోగం సాధించిన దివ్య విజయగాథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుకుమార్, ఆయన భార్య తబిత ఈ సక్సెస్‌ స్టోరీని గర్వంగా పంచుకున్నారు. ఇంట్లో పనికి వచ్చిన దివ్యకు చదువులో ఆసక్తి ఉన్న విషయం గుర్తించిన తబిత, సుకుమార్ దంపతులు ఆమెకు పూర్తి మద్దతు ఇచ్చారు.

Sukumar

మామూలుగా ఓ ఇంటి పనివారి జీవితం చదువు, కష్టాలు మధ్యే ఆగిపోతుంది. కానీ, దివ్య తన కలలను సాకారం చేసుకునేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తూ మెరిట్‌లో రాణించింది. తబిత ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “ఈ విజయంతో ఆమె మా జీవితాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తుగా నిలిచింది,” అని వెల్లడించారు. ఈ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తబిత అన్నారు, “దివ్య తన కలలను నిజం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంతో గర్వంగా ఉంది.

తన ప్ర‌యాణం మాకు స్ఫూర్తిదాయకం. ఆమె భవిష్యత్తు ఎంతో ప్రకాశవంతంగా ఉండాలని ఆశిస్తున్నాం.” దివ్యకు సంబంధించిన ఫోటోలను తబిత పంచుకోవడం అంతర్జాలంలో చర్చనీయాంశంగా మారింది. సుకుమార్ కుటుంబం దివ్యకు పూర్తిస్థాయి మద్దతు అందించి, ఆమె విద్యాభ్యాసానికి ఆర్థికంగా సహాయం చేసింది. దివ్య సాధించిన విజయాన్ని చూసి సుకుమార్ కుటుంబం ఆనందంతో నిండిపోయింది. తబిత సోషల్ మీడియా ద్వారా “నువ్వు మా కుటుంబానికి ప్రేరణలా నిలిచావు,” అంటూ ప్రత్యేకంగా అభినందించారు.

ప్రస్తుతం ఈ సక్సెస్ స్టోరీపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. కేవలం సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలోనూ సుకుమార్ ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని అందరూ అంటున్నారు. “సమాజంలో ఎవరినీ చిన్నచూపు చూడకూడదని దివ్య విజయగాథ అందరికీ ఓ పాఠం,” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ వజ్రోత్సవం.. బాలకృష్ణ పోస్ట్‌ వైరల్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus