టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలు అగ్ర దర్శకుల ఆలోచనలు బార్డర్ దాటి వేలుతున్నాయి. కేవలం ఒక భాషకు మాత్రమే పరిమితం కాకుండా అంతకు మించి అనేలా పరబాషలో కూడా క్లిక్ అయ్యేలా సినిమాలు చేస్తున్నారు. ఒక్కసారి పాన్ ఇండియా సినిమాను టచ్ చేస్తే ఆ తరువాత కూడా అదే తరహాలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక దర్శకుడు సుకుమార్ కూడా పుష్ప సినిమా తరువాత తన సినిమాలను మిగతా భాషల్లో కూడా భారీ స్థాయిలోనే విడుదల చేయాలని అనుకుంటున్నాడు.
పవర్ఫుల్ లైనప్ తో సిద్దమవుతున్న సుకుమార్ మొదట పుష్ప రెండవ భాగాన్ని విడుదల చేయనున్న విషయం తెలిసిందే.అల్లు అర్జున్ తక్ 2021లో పుష్ప ది రైస్ అంటూ బిగ్ హిట్ అందుకున్న సుకుమార్ ఆ తరువాత అంతకుమించి అనేలా 2022లో పుష్ప ది రూల్ తో రాబోతున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తరువాత రామ్ చరణ్ తోనే చేస్తాడని అందరూ అనుకున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో సుకుమార్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ పై దర్శకుడు రాజమౌళి ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆ సినిమాలో ఒక ఇంట్రడక్షన్ సీన్ మామూలుగా ఉండదని అన్నారు. అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండ సుకుమార్ లైనప్ పై ఒక ఒక క్లారిటీ ఇచ్చేశాడు. సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ అందించిన విజయ్ దేవరకొండ 2021లో ది రైజ్, 2022లో ది రూల్, 2023లో ది ర్యాంపేజ్ ఉంటుందని చెప్పేశాడు. అంటే రామ్ చరణ్ కంటే ముందే విజయ్ తో సుకుమార్ సినిమా చేయబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది.
ఇక వీరి కలయికలో వచ్చే సినిమా ఈ ఏడాది పుష్ప అనంతరం మొదలయ్యే అవకాశం ఉంది. ఇక ఆ లోపు విజయ్ ఆగస్టు లోనే లైగర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాడు. మరి ఈ కాంబో ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.