Sukumar: పుష్ప దెబ్బ.. సుకుమార్ కు ఇప్పుడైనా అర్ధమవుతుందా?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న అగ్ర దర్శకులలో సుకుమార్ కూడా టాప్ లిస్టులో ఉన్నారు అని చెప్పవచ్చు. అగ్ర దర్శకుడు రాజమౌళి కూడా సుకుమార్ కి ప్రత్యేకమైన అభిమాని అని అందరికీ తెలిసిన విషయమే. ఇక సుకుమార్ పనితనం గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లెక్కల మాస్టారుగా జీవితాన్ని మొదలుపెట్టి ప్రస్తుతం సినిమా దర్శకుడిగా కొనసాగుతున్న సుకుమార్ ఒక విషయంలో మాత్రం ఎప్పటిలానే తప్పులు చేస్తూ ఉండడం విశేషం.

పుష్ప సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో ప్రీ ప్రొడక్షన్ విషయంలో ఇంకా స్పీడ్ పెంచలేదని చాలా ఈజీ గా అర్థమైంది. ఇక హిందీ లో ప్రస్తుతం వస్తున్న కలెక్షన్ చూస్తూ ఉంటే ఒక విషయం చాలా క్లారిటీ గా అర్థమైంది. బాలీవుడ్లో ప్రమోషన్స్ ఒక నెల ముందు నుంచే మొదలు పెట్టాల్సింది. తప్పకుండా అక్కడ కూడా సినిమా భారీ స్థాయిలో వసూళ్లను అందుకునేది. కానీ దర్శకుడిగా సుక్కు ఆ విషయంలో ఇంట్రెస్ట్ తీసుకున్నట్లుగా అనిపించలేదు. చిత్ర యూనిట్ సభ్యులు సినిమా విడుదల చేసి చేతులు దులిపేసుకున్నట్లు అనిలించింది.

నాన్నకు ప్రేమతో, వన్-నేనొక్కడినే, రంగస్థలం సినిమాలకు కూడా సుకుమార్ చాలా హడావిడిగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకోవాల్సి వచ్చింది. అన్ని సినిమాలకు జరిగినట్లుగా పరిస్థితిలో సపోర్ట్ చేయవని పుష్ప సినిమాతో మరోసారి రుజువయింది. ఒకవైపు కరోనా కష్టకాలం మరోవైపు ఆంధ్రప్రదేశ్లో టికెట్ల ధరలు పుష్ప సినిమాపై కొంత భయాన్ని కలిగించాయి. సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ మిగతా భాషల్లో మాత్రం అనుకున్నంత స్థాయిలో రావడం లేదు. పాన్ ఇండియా అనే పదానికి దగ్గరగా సినిమా ఇంకా చేరుకోలేదు అనే కామెంట్స్ వస్తున్నాయి.

ఇక సోమవారం మిగతా భాషల్లో కలెక్షన్స్ అయితే బాగా తగ్గిపోయాయి. సుకుమార్ ముందుగానే పక్కా ప్రణాళికలతో మిగతా భాషల్లో కూడా పుష్ప సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేయగలిగి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. ఒకవైపు రాజమౌళిని నెల రోజుల ముందు నుంచే త్రిబుల్ ఆర్ సినిమాను ప్రమోట్ చేస్తూ ఎంత తెలివిగా నడుచుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అలాంటి దర్శకుడిని అభిమానిగా మలుచుకున్న సుకుమార్

ఇంకా సరైన పద్ధతిలో పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లక పోవడం విశేషం. అభిమానుల్లో సుకుమార్ కు ఇది పెద్దగా నెగిటివ్ భావాన్ని కలిగించకపోయినప్పటికీ కూడా కలెక్షన్స్ పై కొంత ప్రభావం చూపుతుంది అనే చెప్పాలి. ఇక భవిష్యత్తులో అయినా సుకుమార్ టెన్షన్ లేకుండా సినిమాను విడుదల చేస్తాడో లేదో చూడాలి.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus