Sukumar: ‘పుష్ప’రాజ్‌ విషయంలో సుకుమార్‌ డేర్‌ స్టెప్‌!

సినిమా క్లైమాక్స్‌లో సీక్వెల్‌ ఉంది అంటూ… ఓ హింట్‌ ఇస్తారు గుర్తుందా? చాలా సినిమాలకు ఇలాంటి హింట్‌లు చూసే ఉంటారు. ఇప్పుడు అదే స్టైల్‌లో సుకుమార్‌ కూడా వెళ్లబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఇదేంతా ఏదో సినిమాకు అనుకునేరు. ఆయన రాబోయే సినిమా ‘పుష్ప ది రూల్‌’ గురించే. అవును ఈ సినిమాకు ఆఖరులో సీక్వెల్‌ ఉంది అనే హింట్‌ ఇస్తారు అని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో దీని గురించే చర్చ నడుస్తోంది. సోషల్‌ మీడియా పరిస్థితీ ఇదే.

Click Here To Watch NOW

‘పుష్ప ది రైజ్‌’కు సీక్వెల్‌గా ‘పుష్ప ది రూల్‌’ వస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ మొదలవుతుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ సిండికేట్‌ నాయకుడిగా ఎదిగిన ‘పుష్ప’రాజ్‌ … తర్వాత సామ్రాజ్యాన్ని ఎలా ఏలాడు, ఏమయ్యాడు అనేది రెండో పార్టులో చూపిస్తారు. అయితే రెండు పార్టులతో సినిమా కథ పూర్తయ్యేలా కనిపించడం లేదట. దీంతో మూడో పార్ట్‌కి వెళ్దాం అనుకుంటున్నారని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఇది ఆప్షనల్‌ మాత్రమే అని కూడా చెబుతున్నారు.

‘పుష్ప 2’కి సంబంధించిన స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. త‌మిళ‌నాడులోని కూనూర్‌లో మరోసారి డిస్కస్‌ చేసి కథ, స్క్రిప్ట్‌ ఫిక్స్‌ చేసేస్తారట. జూన్‌, జులైలో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లెట్టాల‌ని చూస్తున్నారట. ఇటీవల జరిగిన చర్చల్లో మూడో పార్టు తీస్తే ఎలా ఉంటుంది అనే మాట వచ్చిందట. రెండు పార్టులకు ప్రస్తుత కథ, రివేంజ్‌ పూర్త చేసేసి, మూడో పార్టు నుండి కొత్త కథ అందుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. అయితే రెండో పార్టుకు వచ్చే రెస్పాన్స్‌ చూసి అప్పుడు మూడో పార్టు గురించి ముందుకెళ్లాలా వద్దా అనేది తేల్చుకుంటారట.

ఒకవేళ మూడో పార్టు తీయాలన్నా… దానికి చాలా గ్యాప్‌ తీసుకోవాలని చిత్రబృందం అనుకుంటోందని సమాచారం. వెంటనే మొదలెట్టేయకుండా బన్నీ, సుకుమార్‌ వేరే సినిమా చేసి వచ్చాక మూడో ‘పుష్ప’రాజ్‌ను పట్టాలెక్కించాలని చూస్తున్నారట. అయితే ఇదంతా జరిగే పనేనా, మూడో పుష్ప వస్తాడా అనేది కాలమే నిర్ణయిస్తుంది. సారీ రెండో పుష్ప విజయమే నిర్ణయిస్తుంది. కాబ్టటి హోప్‌ ఫర్ ది బెస్ట్‌ రిజల్ట్‌.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus