Sukumar, Mahesh Babu: పుష్ప కథ మహేష్ కు చెప్పిందే.. కానీ: సుకుమార్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత పుష్ప సినిమా ద్వారా భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. అఖండ సినిమా తర్వాత అంతకు మించి అనేలా నేషనల్ వైడ్ గా పుష్ప సినిమా బాగానే ఓపెనింగ్స్ అందుకుంది. ఈ సినిమాతో ప్రస్తుతం చిత్ర నిర్మాతలు చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏక్ శనివారం ఆదివారం కూడా సినిమా కలెక్షన్స్ మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక సోమవారం రోజు సినిమాకు అసలు పరీక్ష మొదలుకానుంది. ఇక ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా కథ పై ప్రస్తుతం ఓ వర్గం నుంచి తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్స్ అయితే వెలువడుతున్నాయి.ఇక మహేష్ బాబు ఇలాంటి స్టోరీ చేయకపోవడం మంచిది అయింది అని కూడా మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రంగస్థలం సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలని అనుకున్న విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమా పుష్ప కథ అని ఆ మధ్య కథనాలు చాలానే వచ్చాయి. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు సుకుమార్ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. మహేష్ బాబు తో చెప్పిన కథకు అలాగే పుష్ప స్టోరీ కంటే చాలా భిన్నంగా ఉంటుంది అని.. అయితే ఒక విధంగా అది వేరు ఇది వేరు అని ఖచ్చితంగా చెప్పలేను, అలాగని ఒకటే అని కూడా చెప్పలేనని సుకుమార్ తెలియజేశాడు.

అంటే దర్శకుడు సుకుమార్ చెప్పినట్లుగా మహేష్ బాబు కోసం మరొక కోణంలో కథను రాసినట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ కు చెప్పిన తర్వాత ఆ కథను పూర్తి స్థాయిలో మార్చి చేసినట్లుగా కనిపిస్తోంది. ఒక విధంగా ప్రస్తుత పుష్ప కథ అయితే మహేష్ బాబు తగ్గట్టుగా చేసి ఉంటే ఏ మాత్రం సెట్ అయ్యేది కాదని చెప్పవచ్చు. ఇక పుష్ప 2 సినిమా విషయంలో సుకుమార్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus