Anasuya: సుమ, బ్రహ్మాజీ వల్ల మరోసారి హాట్ టాపిక్ అయిన అనసూయ…!

ఎక్కువగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు స్టార్ యాంకర్ సుమనే హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. ప్రీ రిలీజ్ ఆరంభంలో ఈమె గెస్ట్ లతో చేసే ఫన్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా సీనియర్ నటులపై ఈమె సెటైర్లు వేస్తూ నవ్వులు పూయిస్తూ ఉంటుంది. ఒకవేళ అక్కడ బ్రహ్మాజీ వంటి సీనియర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు అంటే అక్కడి వాతావరణం అంతా సరదాగా మారుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా నాగశౌర్య నటించిన `కృష్ణ వ్రింద విహారి` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కూడా వీరి ముచ్చట చాలా సరదాగా మారిపోయింది.

బ్రహ్మాజీ, సుమ మధ్య ఓ సరదాగా కన్వర్జేషన్‌ జరిగింది. ఇద్దరు కలిసి నవ్వులు పూయించారు. బ్రహ్మాజీ వద్దకు ప్రశ్నలు అడగడానికి వచ్చిన సుమ..’మీ మనోభావాలు ఎప్పుడైనా దెబ్బతిన్నాయా? అంటూ ప్రశ్నించింది. అందుకు బ్రహ్మాజీ ‘బాగా ఆకలేస్తుంది. ఇప్పటివరకు షూటింగ్లో పాల్గొని వచ్చాను. మళ్ళీ పొద్దున్నే షూటింగ్ ఉంది’ అంటూ జవాబిచ్చాడు. అటు తర్వాత ‘మీ ఆస్తి వివరాలు చెప్పండి’ అంటూ సుమ అడగ్గా… ‘మీ రాజీవ్ కంటే ఎక్కువే!’ అన్నట్టు బదులిచ్చాడు.

సరే మీ ఏజ్ చెప్పండి అంటూ మళ్ళీ సుమ ప్రశ్నించగా.. ‘యు నాటి ఆంటీ’ అంటూ సమాధానం ఇచ్చాడు బ్రహ్మాజీ. దీంతో ఒక్కసారిగా షాకైన సుమ ‘ఇది ఎటు వెళ్తుందో ఏమవుతుందో?’ అంటూ కామెంట్ చేసింది. అంతా బానే ఉంది కానీ బ్రహ్మాజీ చేసిన కామెంట్లు పరోక్షంగా అనసూయని ఉద్దేశించే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఆంటీ అన్నందుకు అనసూయ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే.

కేసు వేస్తున్నా అంటూ ఆమె నెటిజెన్ల పై రెచ్చిపోయింది. దీని పై బ్రహ్మాజీ ఆల్రెడీ కౌంటర్ వేశాడు. ‘అంకుల్ అన్నందుకు కేసు వేస్తా’ అంటూ ఈ మధ్యనే ట్విట్టర్లో సెటైర్ వేశాడు. అందుకే కొందరు నెటిజన్లు అనసూయ పై మళ్ళీ సెటైర్లు వేయడం మొదలుపెట్టారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus