సుమ – రాజీవ్ కనకాల 24వ వెడ్డింగ్ యానివర్సరీ.. వైరల్ అవుతున్న వీడియో..

  • February 10, 2023 / 04:37 PM IST

స్టార్ యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు. మాతృభాష మలయాళం అయినా కానీ తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది. ఆమె మైక్ పట్టుకుని తెలుగు భాషలో మాట్లాడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. సుమ లేని షోస్, సినిమా ఈవెంట్స్ ఊహించలేనంతగా ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసుకుందామె. సుమ – రాజీవ్ కనకాలది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసింది. రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన ‘మేఘమాల’ సీరియల్‌లో కలిసి నటిస్తున్న సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

పెద్దలను ఒప్పించి 1999 ఫిబ్రవరి 10న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 2023 ఫిబ్రవరి 10న తమ 24వ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సుమ – రాజీవ్ తమ వెడ్డింగ్ యానివర్సరీని కాస్త వెరైటీగా జరుపుకున్నారు. ఇద్దరూ ఒకచోట లేకపోవడంతో వీడియో కాల్‌లో పాట ద్వారా సెలబ్రేట్ చేసుకున్నారు.

సుమ : ‘నువ్వక్కడ, నేనిక్కడ.. పాటక్కడ, పలుకిక్కడ’.. రాజీవ్ : ‘మనసొక్కటి కలిసున్నది ఏ నాడైనా’.. అంటూ పాడారు.. ఫ్యాన్స్, తెలుగు ఆడియన్స్, టీవీ, సినీ రంగాల వారు ఈ లవ్లీ కపుల్‌కి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus