Suma: క్యాష్ కార్యక్రమంలో డాన్స్ చేస్తూ రెచ్చిపోయిన సుమ?

బుల్లితెర యాంకర్ గా వ్యవహరిస్తూ బుల్లితెర పై మకుటం లేని మహారాణిగా గుర్తింపు పొందిన సుమ యాంకరింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో టీవీ షో లకి యాంకర్ గా వ్యవహరించిన సుమ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ షో కి కూడా ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా వ్యవహరిస్తోంది. ప్రతివారం ప్రసారమయ్యే ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీలతో కలిసి సుమ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈవారం ప్రసారం కాబోతున్న ఈ షోలో సీతారామం టీం సందడి చేసింది.

ఇక ఈ ఎపిసోడ్ లో హీరో సుమంత్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరో దుల్కర్ సల్మాన్, హనుమాన్ రాఘవపూడి ఫుల్ సందడి చేసారు. ఇటీవల ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ షోలో సుమంత్, దుల్కర్, హనుమాన్ తమ పంచ్ లతో రెచ్చిపోయారు. మహానటి సినిమాలో ఎమ్జీఆర్ పాత్రలో నటించిన దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన వ్యక్తి. ఈ సినిమాలో దుల్కర్ నటన ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది.

ఇక క్యాష్ షో లో పాల్గొన్న దుల్కర్ సావిత్రికి లవ్ ప్రపోజ్ చేసే సన్నివేశాన్ని సుమతో కలిసి చేసారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తేనెమనసులు సినిమాలోని పాటకు డాన్స్ చేసి సందడి చేశారు. ఇక ఈ షో లో సుమంత్ తన మనసులోని ఫీలింగ్స్ చెప్పటానికి ఇమోజిస్ వాడి చెప్పాడు. దీంతో ఫీలింగ్స్ ఇలా కూడా చెప్తారా అని అనగా సుమంత్ లాగే అతని మనసు కూడా బండరాయి అని జోక్ చేశారు.

ఇక ఈ షో దుల్కర్ మీ భార్యని మీరు ఏమని పిలుస్తారు అని ఒక అభిమాని అడగ్గా..జాన్ అంటూ సమధానం చెప్పాడు. దీంతో సుమ రాజీవ్ ని ఉద్దేశిస్తూ నువ్వు నన్ను ఎప్పుడైనా అల పిలిచావా రాజా అని అంటుంది. సీతారామం సినిమా ప్రమోషన్స్ కోసం ఈ షో లో పాల్గొన్న వీరు సుమతో కలిసి ఫుల్ హంగామా చేశారు. మొత్తానికి ఈ వారం ప్రసారం కాబోయే ఈ క్యాష్ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందనీ చెప్పాలి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus