Suma,Rajeev Kanakala: రాజీవ్ తో పెళ్లిపై సుమ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమైందంటే?

బుల్లితెరపై చాలామంది యాంకర్లు ఎక్కువకాలం టాప్ యాంకర్ గా కెరీర్ ను కొనసాగించలేక ఇండస్ట్రీకి దూరమవుతున్నారనే సంగతి తెలిసిందే. అయితే సుమ మాత్రం అవాక్కయ్యారా ప్రోగ్రామ్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరై గత 18 సంవత్సరాల నుంచి యాంకర్ గా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఈ ఛానల్ ఆ ఛానల్ అనే తేడాల్లేకుండా అన్ని ఛానెళ్లలో సుమ షోలు ప్రసారమవుతూ మంచి రేటింగ్స్ సాధిస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరిగినా ఆ ఈవెంట్లలో కూడా సుమ సందడి చేస్తున్నారు.

చాలామంది యాంకర్లతో పోల్చి చూస్తే సుమ రెమ్యునరేషన్ ఎక్కువైనా నిర్మాతలు సుమకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. తాజాగా క్యాష్ షో ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో సుమ రాజీవ్ కనకాలతో పెళ్లి పాపం రాఘవేంద్ర రావుదే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆగష్టు 19వ తేదీన వాంటెడ్ పండుగాడ్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ టీమ్ క్యాష్ షోకు హాజరై సందడి చేశారు. అనసూయ రాఘవేంద్రరావు చేతిలో చెయ్యేసుకుని షోలోకి ఎంట్రీ ఇచ్చారు.

రాఘవేంద్రరావు మేము ఇలా చేతిలో చెయ్యి పట్టుకుని ఎందుకు వచ్చి ఉంటాం అని సుమను అడగగా అనసూయ మెట్లు ఎక్కలేదని ఆమెను మీరు పట్టుకొచ్చారంటూ సుమ పంచ్ వేశారు. ఆ తర్వాత రాఘవేంద్రరావు కాలేజ్ లో అనసూయ అనే అమ్మాయి ఉండేదని ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాలనే ఆలోచనతో ఈ అనసూయతో ఎంట్రీ ఇచ్చానని రాఘవేంద్రరావు తెలిపారు.

లక్కీగా మీ జీవితంలో సుమ అనే అమ్మాయి మాత్రం రాలేదంటూ సుమ కామెంట్ చేయగా సుమ లేని జీవితం అసలు ఉందా? నా వల్లే కదా నీ మ్యారేజ్ అయింది అని రాఘవేంద్రరావు అన్నారు. సుమ వెంటనే “ఆ పాపం మీదే సార్” అని సుమ రివర్స్ లో రాఘవేంద్రరావుపై పంచ్ వేశారు. ఈ నెల 20వ తేదీన ఈటీవీ ఛానల్ లో రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus