అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ నిర్మించి, డైరెక్ట్ చేసిన చిత్రం ‘రుద్రమదేవి’. ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. ఏదో అల్లు అర్జున్ ఉన్నాడని కొద్దిపాటి ప్రేక్షకులు చూడటంతో డిజాస్టర్ నుండీ తప్పించుకుని యావరేజ్ గా నిలిచింది. కథ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషణ్ బాగోకపోవడంతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇక ఈ చిత్రంలో సుమన్ ప్రతినాయకుడి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఆ చితం సమయంలో పది లక్షలకుగానూ.. తనకి గుణశేఖర్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందంటూ సుమన్ కోర్టుకు వెళ్ళాడు. అయితే చాలా రోజుల తరువాత విషయం పై స్పందించాడు సుమన్.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుమన్ ఈ విషయం పై స్పందించాడు. సుమన్ మాట్లాడుతూ… “రుద్రమదేవి సినిమా క్లైమాక్స్ లో నాకు .. అనుష్కకి మధ్య భారీ యాక్షన్ సీన్ ఉంటుందని గుణశేఖర్ చెప్పాడు. ఆ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందనే ఉద్దేశంతోనే నేను ఆ సినిమాకి అంగీకరించాను. అయితే చివరికి వచ్చేసరికి ఆ యాక్షన్ సీన్ లేకుండా చేశాడు. అలా నా పాత్ర రేంజ్ ను తగ్గించి నన్ను అవమానపరిచాడు గుణశేఖర్. ఇక డబ్బులు కూడా తరువాత ఇస్తానని చాలాసార్లు వాయిదా వేశాడు. కేవలం డబ్బు విషయమయితే నేను పెద్దగా పట్టించుకునేవాణ్ణి కాదు. కానీ నా పాత్ర ప్రాధాన్యతను తగ్గించడం నాకు చాలా బాధ కలిగించింది. అందుకే కోర్టుకు వెళ్ళి నాకు రావలసిన మొత్తాన్ని రాబట్టుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.