Sumanth, Niharika: నిహారిక మనస్తత్వం అలాంటిది.. సుమంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎమ్మెస్ రాజు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ ద్వారా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈయన బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇకపోతే ఎమ్మెస్ రాజు కొడుకుగా సుమంత్ అశ్విన్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఈయన పలు చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. తాజాగా సుమంత్ 7 డేస్ 6 నైట్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమంత్ అశ్విన్ తన తండ్రి నిర్మాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను గురించి తెలియజేశారు.దేవి పుత్రుడు సినిమా కోసం నాన్న సుమారుగా మూడు సంవత్సరాల పాటు ఎంతో కష్టపడ్డారని అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఈ సినిమాలో వచ్చే నష్టాన్ని మనసంతా నువ్వే సినిమా కవర్ చేసిందని తెలిపారు.

ఇక ఇంట్లో సినిమాలకు సంబంధించిన ఎలాంటి విషయాలను కూడా తాము ప్రస్తావించని ఒకవేళ నేను ఏదైనా సినిమాలో నటిస్తున్నాను అంటే ఆ సినిమాకు సంబంధించిన కథ గురించి ఇంట్లో చర్చిస్తామని తెలిపారు. ఇకపోతే సుమంత్ హ్యాపీ వెడ్డింగ్ అనే చిత్రం ద్వారా మెగా డాటర్ నిహారికతో కలిసి నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలో నిహారిక గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

నిహారిక మెగా కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తనలో స్టార్ కిడ్ అనే ఈగో లేదని అందరితోనూ ఎంతో సరదాగా మాట్లాడుతూ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటుందని సుమంత్ తెలిపారు. నిహారిక చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి అంటూ తన గురించి సుమంత్ వెల్లడించారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో నిహారిక ఒక హోటల్ చూపించి అందులో దయ్యాలు ఉంటాయని నన్ను చాలా భయపెట్టింది అంటూ ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ ఆ విషయాలను గుర్తు చేసుకున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Share.