ఓటీటీల వల్ల థియేట్రికల్ బిజినెస్ ఎలా ఉన్నా.. ఎక్కువగా దెబ్బతింది ఏంటంటే డౌట్ లేకుండా శాటిలైట్ బిజినెస్ (Satellite Business) అనే చెప్పాలి.ఓటీటీలు.. ఇంటర్నెట్..ల హవా పెరిగిన తర్వాత సిటీల్లో చాలా మంది కేబుల్, డిష్ వంటి కనెక్షన్స్ పెట్టించుకోవడం మానేశారు.2016 సమ్మర్ వరకు శాటిలైట్ బిజినెస్ బాగానే ఉండేది. కానీ ఎప్పుడైతే జియో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుండి చాలా మంది యూట్యూబ్ వంటివాటికి ప్రిఫరెన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. చేతిలోనే ప్రపంచం కనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్ల వరకు వెళ్లనవసరం లేదు అని… జియో ఇంటర్నెట్ సర్వీసు అందుబాటులోకి వచ్చాక చాలా మంది డిసైడ్ అయిపోయారు.
తర్వాత దీని వల్ల డిజిటల్ సంస్థలు పెరిగాయి. ఓటీటీల సంగతి ఇక చెప్పనవసరం లేదు. సినిమా రిలీజ్ అయిన 4 వారాలకే ఓటీటీకి వచ్చేస్తుంది. సో టాక్ కనుక ఏమాత్రం తేడా వచ్చినా.. థియేట్రికల్ బిజినెస్ జరగడం లేదు. టికెట్ రేట్లు వంటివి కూడా ఆకాశాన్నంటాయి. మరోవైపు నిత్యావసర ధరలు వంటివి పెరిగిపోయాయి. ఇలాంటివి కూడా జనాలను థియేటర్లకు రాకుండా చేస్తున్నాయి. ఒకప్పుడు చిన్న సినిమాలు ఓ మాదిరిగా ఉంటే శాటిలైట్ బిజినెస్ కచ్చితంగా జరుగుతుందిలే అనే ధీమా ఉండేది. కానీ ఇప్పుడు ఓటీటీలు ఎంత చెబితే అంత అన్నట్టు ఉంది పరిస్థితి.
పెద్ద సినిమాలకి కూడా టీవీల్లో సరైన టీఆర్పీ రేటింగ్లు రావడం లేదు. ఓటీటీకి సినిమా వచ్చింది అంటే తర్వాత అది టీవీల్లో టెలికాస్ట్ అయ్యే వరకు ఆడియన్స్ చూడటం లేదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘పుష్ప 2’ టీఆర్పీ రేటింగ్లను చెప్పుకోవచ్చు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా ఒకేసారి టీవీల్లో, ఓటీటీలోకి అందుబాటులోకి రావడం వల్ల దానికి మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చింది. కానీ ‘పుష్ప 2’ (Pushpa 2) ముందుగానే ఓటీటీకి వచ్చింది. తర్వాత టీవీల్లో టెలికాస్ట్ అయ్యింది. అందువల్ల సంక్రాంతికి వస్తున్నాం కంటే దానికి తక్కువ టీఆర్పీనే నమోదైంది.
సో శాటిలైట్ బిజినెస్ (Satellite Business) బాగుండాలి అంటే కచ్చితంగా ఓటీటీ రిలీజ్ కంటే ఒకరోజు ముందుగానే టీవీల్లో టెలికాస్ట్ అయితే బెటర్ అని సంక్రాంతికి వస్తున్నాం ప్రూవ్ చేసింది. మరోపక్క సమ్మర్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా టీవీలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని లేటెస్ట్ సర్వే ద్వారా ప్రూవ్ అయ్యింది. మార్చి నెల ఎండింగ్ నుండి చూసుకుంటే.. టీవీల్లో టెలికాస్ట్ అయ్యే సినిమాలకి కొంచెం బెటర్ టీఆర్పీ రేటింగులు వస్తున్నాయట. ఐపీయల్ వంటివి ఉన్నప్పటికీ… టీవీల్లో టెలికాస్ట్ అయ్యే సినిమాలు వంటి ఎంటర్టైన్మెంట్ ఫీడ్ ను ఆడియన్స్ బాగానే వీక్షిస్తున్నట్టు తెలుస్తుంది. సో శాటిలైట్ బిజినెస్ సమ్మర్లో బాగుంటుందని అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్టే..!