మరో బిజినెస్ స్టార్ట్ చేసిన సందీప్ కిషన్..!

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని మరోసారి పలకరించేందుకు వచ్చేస్తున్నాడు సందీప్ కిషన్. హాకీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అయితే, ఈసినిమాకి భారీగా ఖర్చుపెట్టాడని ఎలాగైనా సరే ఈసినిమా హిట్ అవ్వాలని మనోడు చూస్తున్నాడట. హీరో సందీప్ కిషన్ తన దగ్గరున్న డబ్బంతా ఈ సినిమాకే ఖర్చుపెట్టాడని, ఫైనాన్షియల్ గా చాలా వీక్ అయ్యాడని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మనోడు సరికొత్త బిజినెస్ రంగంలోకి దిగబోతున్నాడట.

మొన్న వివాహభోజనంబు అంటూ సందీప్ కిషన్ ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఇది ప్రస్తుతం బాగానే నడుస్తోంది. కానీ, లాక్డౌన్ లో చాలా లాస్ వచ్చిందని, కస్టమర్స్ లేక చాలా ఇబ్బంది పట్టారని , ఈ హోటల్ మూసేయబోతున్నారని కూడా చాలా వార్తలు వచ్చాయి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా వాటిని ఎదిరించి మరీ ప్రస్తుతం దీన్ని రన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ బిజినెస్ తో పాటుగా సెలూన్స్ ని కూడా ఓపెన్ చేయబోతున్నాడట హీరో సందీప్ కిషన్.

అంతేకాదు, దీనికోసం సర్వే కూడా చేశారని టాక్. విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, కాకినాడ ఇలా అన్ని ప్లేస్ లలోనూ ఈ సెలూన్స్ ని ఓపెన్ చేయబోతున్నారని అంటున్నారు. అంతేకాదు, వీటితో పాటుగా వివాహభోజనంబు రెస్టారెంట్ బ్రాంచ్ లని కూడా ప్లాన్ చేస్తున్నాడట సందీప్ కిషన్. మొత్తానికి హీరోగానే కాకుండా ఇలా బిజినెస్ లు చేస్తూ మంచి వ్యాపారవేత్తగా కూడా మారుతున్నాడు ఈ యంగ్ హీరో. అదీ విషయం.

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus