ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొదటి 3 సినిమాలకే స్టార్ హీరో అయిపోయాడు ఉదయ్ కిరణ్. తన 19వ ఏటనే ‘చిత్రం’ సినిమాలో నటించి తరువాత 20 ఏళ్లకే ‘నువ్వు నేను’ ‘మనసంతా నువ్వే’ చిత్రాలతో హిట్లు కొట్టి స్టార్ హీరో అయిపోయాడు.ఆ తరువాత కూడా అతను నటించిన 4,5 సినిమాలు బాగానే ఆడాయి. కానీ ఏమైందో ఏమో ఆ తరువాత నుండీ .. అతని డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. అతనికి ఆఫర్లు తగ్గిపోయాయి.
అతను నటించాల్సిన చాలా సినిమాల నుండీ అతన్ని తీసేసారు. అదే క్రమంలో అతను మనసుపెట్టి చేసిన ఎన్నో సినిమాలు టైం కి రిలీజ్ కాకుండా లేట్ గా రిలీజ్ అయ్యాయి. సరే ఇవన్నీ పక్కన పెట్టేసి.. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన పలు సినిమాల్లో కమెడియన్ గా నటించిన సునీల్.. ఇటీవల ఉదయ్ గురించి ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చాడు. సునీల్ మాట్లాడుతూ.. ” ‘నువ్వు నేను’ సినిమా ఓపెనింగ్ షాట్లో ఒక రన్నింగ్ రేస్ సీనుంటుంది. ఆ రన్నింగ్ రేస్ సీన్ కోసం డైరెక్టర్ తేజ గారు రియల్ రన్నింగ్ రేస్ ఛాంపియన్లను తీసుకున్నాడు.
అది కూడా పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటూ.. ఫస్ట్ ,సెకండ్ వచ్చిన వాళ్ళు.! అయితే వాళ్ళందరి కంటే కూడా ఫాస్ట్ గా ఉదయ్ పరిగెట్టేసేవాడు. నేను షాక్ అయ్యాను. ‘అసలెలా ఇది? అంత ఫాస్ట్ గా ఎలా పరిగెత్తావ్?’ అని నేను ఉదయ్ ని అడిగాను. దానికి ఉదయ్.. ‘నేను చిన్నప్పటి నుండీ సిటీ బస్సుల వెనక పరిగెత్తే వాడిని’ అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. నిజంగా ఎక్కడున్నాడో కానీ ఉదయ్ బంగారం” అంటూ చెప్పుకొచ్చాడు.