ఎన్నో కామెడీ చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు అల్లరి నరేష్. ఇదే సమయంలో ‘నేను’, ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ వంటి విభిన్న చిత్రాలు కూడా చేసాడు. ఈ చిత్రాలు కూడా నరేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టినా.. తన కంఫర్ట్ జోనర్ అయిన కామెడీ నే నమ్ముకుని సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ చాలా వరకూ కామెడీ కథలకి కాలం చెల్లిపోయిన ఈరోజుల్లో హిట్టు కొట్టలేక డీలా పడిపోయాడు. ఇలాంటి సమయంలో అల్లరి నరేష్ కు ‘మహర్షి’ అనే చిత్రం తిరిగి ఉత్సాహాన్నిచ్చింది. ఈ చిత్రంలో రవి పాత్ర పోషించిన నరేష్ కు ప్రశంసలు దక్కాయి.
దీంతో రవితేజ,విఐ ఆనంద్ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో మరో హీరోకి ఛాన్స్ ఉండడంతో నరేష్ ను అనుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మొదటి ఈ పాత్రకి సునీల్ ను అనుకుంటున్నారట. ‘చిత్రలహరి’ చిత్రంతో చాలా రోజుల తరువాత సునీల్ మంచి నటన కనబరిచాడు. అయితే కారణమేంటో తెలీదు కానీ ‘డిస్కో రాజా’ లో సునీల్ ప్లేస్ లో నరేష్ ను తీసుకోవాలని డైరెక్టర్ ఆనంద్ అనుకుంటున్నాడట. కానీ రవితేజ మాత్రం ఈ క్యారెక్టర్ కు సునీల్ అయితేనే కరెక్ట్ అని చెప్పాడట. దీంతో సునీల్ నే కంటిన్యూ చేయొచ్చని టాక్ నడుస్తుంది. రవితేజ, సునీల్ మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కారణంగానే సునీల్ ను రవితేజ వదలట్లేదని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.