‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు’ అనే ఒక్క పాటతో ఓవర్ నైట్లో స్టార్ సింగర్ అయిపోయింది సునీత. ఎలాంటి పాటకైనా తన మధురమైన గొంతుతో జీవం పోస్తుంటుంది సునీత. చూడ చక్కనైన రూపం కూడా సునీత సొంతం. సింగర్ గానే కాకుండా.. ఎన్నో సినిమాల్లో హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పింది.ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఆరంభంలో రెండో వివాహం చేసుకుని సునీత కొత్త లైఫ్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది వ్యతిరేకించి,విమర్శించినప్పటికీ..
చాలామంది సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలబడి ఆమె తీసుకున్న నిర్ణయం సరైందే అంటూ చెప్పుకొచ్చారు. ఇది పక్కన పెట్టేస్తే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత.. తాను ఓ దర్శకుడి వల్ల ఇబ్బంది పడినట్టు చెప్పి హాట్ టాపిక్ గా నిలిచింది. ఆమె మాట్లాడుతూ.. “ఓ సినిమాకి డబ్బంగ్ చెబుతున్న టైములో ఆ చిత్రం దర్శకుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ముందుగా నేను డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళగానే ఆ చిత్రం దర్శకుడు ‘హలో మేడమ్’ అంటూ నన్ను పలకరించాడు.
ఆ వెంటనే నా అభిమానిని అంటూ కూడా చెప్పి పరిచయం చేసుకున్నాడు. ఇక కొంతసేపటికి అతను నన్ను సునీత అని పేరు పెట్టి పిలవడం మొదలు పెట్టాడు. అటు తరువాత అరేయ్, కన్నా, బుజ్జి అని పిలస్తూ నన్ను ఆశ్చర్యం పరిచాడు. ఆ టైములో నాకు చాలా చిరాగ్గా అనిపించింది.మొత్తానికి నేను బయటపడ్డాను. నా అదృష్టం ఏంటంటే.. ఇప్పటివరకు మళ్ళీ ఆ దర్శకుడిని కలవాల్సిన అవసరం రాలేదు. ఆ టైములో నాకు కోపం వచ్చినా.. ఇప్పుడు ఆ సందర్భాన్ని తలుచుకుంటే నవ్వొస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది సునీత.