Sunny Leone: కానిస్టేబుల్ పోస్ట్ హాల్ టికెట్ పై సన్నీ ఫోటో.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్, టాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో బోల్డ్ సాంగ్స్, సీన్స్ లో నటించడం ద్వారా సన్నీలియోన్ గుర్తింపును సంపాదించుకున్నారు. సినిమాల్లో బోల్డ్ గా కనిపించినా రియల్ లైఫ్ లో మాత్రం మంచి వ్యక్తిత్వంతో సన్నీలియోన్ అభిమానులకు దగ్గరయ్యారు. ఆమె ఆస్తుల విలువ కూడా ఊహించని రేంజ్ లో ఉందని తెలుస్తోంది. అయితే సన్నీలియోన్ ఉత్తరప్రదేశ్ లో కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారంటూ ఒక ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ హాల్ టికెట్ పై సన్నీలియోన్ ఫోటో దర్శనమివ్వడం గమనార్హం.

అయితే వాస్తవానికి ఎవరో ఆకతాయి తన ఫోటోకు బదులుగా సన్నీలియోన్ ఫోటో అప్ లోడ్ చేయడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. ఈ తరహా ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పలువురు సెలబ్రిటీల ఫోటోలు హాల్ టికెట్లపై దర్శనమివ్వడం జరిగింది. సన్నీలియోన్ ఈ ఘటన గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. సన్నీలియోన్ కు గతంతో పోల్చి చూస్తే మూవీ ఆఫర్లు అయితే తగ్గాయి.

పోలీసులు హాల్ టికెట్ ఘటన గురించి విచారణ చేపట్టగా ఈ తరహా పనులు చేస్తే చర్యలు తప్పవని పోలీసులు వెల్లడిస్తున్నారు. సన్నీలియోన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. సన్నీలియోన్ మంచి రోల్స్ ను ఎంచుకోవాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. సన్నీలియోన్ కు సోషల్ మీడియాలో మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

యూపీలో ఈ తరహా ఘటనలు ఎక్కువ సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. సన్నీలియోన్ కు ఇన్ స్టాగ్రామ్ లో 5.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. హాల్ టికెట్ లో పేరు కూడా సన్నీ లియోన్ అని ఉండటం గమనార్హం. హాల్ టికెట్ లో పేర్కొన్న అడ్రస్ ముంబైలో ఉందని సమాచారం అందుతోంది.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus