Sunny Leone: పాప దొరికింది..సన్నీలియోన్ ప్రేమకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగు తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే బుధవారం ఉదయం ఈమె తన పని మనిషి కుమార్తె అనుష్క జోగేశ్వరి కనిపించడం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అనుష్క జోగేశ్వరి నవంబర్ 8వ తేదీ సాయంత్రం వెస్ట్ బెహ్రామ్ బాగ్ లో మిస్ అయింది

చిన్నారుల తల్లిదండ్రుల ఆవేదన చూస్తుంటే నాకు ఎంతో బాధగా ఉంది చిన్నారిని ఎవరైనా చూసి ఉంటే తనను తీసుకొచ్చిన వారికి ఐదు లక్షల రూపాయల నగదు కూడా ఇవ్వబడుతుంది అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేయడమే కాకుండా దానిని ముంబై పోలీసులకు కూడా ట్యాగ్ చేశారు. అయితే ఈమె ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే అనుష్క ముంబై పోలీసులకు దొరకడంతో ఆమెను క్షేమంగా తన తల్లిదండ్రులకు అప్పగించారు.

ఈ క్రమంలోనే ఈమె (Sunny Leone) తనని వెతకడంలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి ముంబై పోలీసులకు ప్రత్యేకంగా థాంక్స్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా మరొక పోస్ట్ చేశారు. అనుష్క దొరికింది. తప్పిపోయిన ఈమెను వెతకడంలో సాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తెలియజేశారు. మన ప్రార్థనలకు సమాధానం దొరికింది. ఆ కుటుంబానికి భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఉన్నాయి ముంబై పోలీసులకు కూడా ధన్యవాదాలు నేను పోస్ట్ పెట్టిన 24 గంటల వ్యవధిలోనే అనుష్క దొరికింది.

ఈ పోస్టును షేర్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన పోస్ట్ వైరల్ గా మారడంతో ఎంతోమంది పనిమనిషి కుమార్తె కోసం సన్నీ లియోన్ ఇంతలా పరితపిస్తోంది. ఈమె మనసు ఎంతో మంచిది అంటూ ఈమెపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus