Bigg Boss 5 Telugu: నాగార్జున తో డైరెక్ట్ గా గేమ్ లో ఎలా ఉంటాడో చెప్పిన సన్నీ..!

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఆదివారం ఫన్ గేమ్స్ ఆడిస్తూ కింగ్ నాగార్జున హౌస్ మేట్స్ లో జోష్ నింపుతారు. శనివారం క్లాస్ పీకిన తర్వాత ఆదివారం హౌస్ మేట్స్ ని చల్లబర్చడంతో సరిపోతుంది. అయితే, ఆదివారం ఎలిమినేషన్ అనేది మాత్రం ఆడియన్స్ తో పాటుగా హౌస్ మేట్స్ లో సైతం ఉత్కంఠని రేకెత్తిస్తుంది. ఇక 9వ వారం హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడించాడు హోస్ట్ నాగార్జున. సన్ డే ఫన్ డే లో భాగంగా హౌస్ మేట్స్ బొమ్మ ఇక్కడ పాట ఎక్కడ అనే గేమ్ ఆడారు. ఇంటి సభ్యులు దీనికోసం రెండు టీమ్స్ గా విడిపోయారు. సన్నీ టీమ్ లో విశ్వ, షణ్ముక్, కాజల్ , ప్రియాంకలు ఉన్నారు. మిగిలిన సభ్యులు రవి టీమ్ లో ఉన్నారు. ఇక్కడే పాటల తాలుకా బొమ్మలు వచ్చేటపుడు సన్నీ చీట్ చేశాడు. దీనికి సన్నీ టీమ్ కి మైనస్ వన్ మార్క్ ఇచ్చాడు కింగ్ నాగార్జున.

ఆతర్వాత ఈగేమ్ చాలా సరదాగా గడిచిపోయింది. ఇది అయిన తర్వాత శ్రీరామ్ చంద్రని సేఫ్ చేశాడు కింగ్ నాగార్జున. ఇక బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ ని గెస్ చేయమని నేను ఎవరిని అనే గేమ్ ని సైతం ఆడించాడు. ఇందులో హౌస్ మేట్స్ ఒకరినొకరు బాగా ఇమిటేట్ చేస్కున్నారు. ఇక్కడే ఈవారం హౌస్ మేట్స్ అందరూ కలిసి వరెస్ట్ పెర్ఫామర్ ని ఎంచుకోమని చెప్పాడు. అందులో మెజారిటీ ఓట్లు కాజల్ కి పడ్డాయి. కాజల్ ని ఈ షో అయిపోయిన తర్వాత జైల్లో పెట్టాల్సి ఉంటుందని కెప్టెన్ అయిన అనీమాస్టర్ కి చెప్పాడు నాగార్జున.

ఇక వరెస్ట్ పెర్ఫామర్ గా అనీమాస్టర్ సన్నీని ఎంచుకున్నప్పుడు నేను గేమ్ లో మూర్ఖుడిగా ఉంటానని , గతవారం సూపర్ హీరోస్ టాస్క్ లో కూడా మానస్ ని టాకిల్ చేసేటపుడు అలాగే ఉన్నానని, అయితే అది అనీమాస్టర్ కి కనిపించలేదు అని చెప్పాడు. అంతేకాదు, నేను గేమ్ వచ్చినపుడు , టాస్క్ వచ్చినపుడు దూసుకునిపోతానని ముూర్ఖుడిగా ఉంటానని నాగార్జున ముందే చెప్పాడు. దీనికి షణ్ముక్ నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నావ్ షణ్ముక్ అంటూ నాగార్జున అడిగాడు. దీనికి షణ్ముక్ ముర్ఖుడు అంటే నవ్వొచ్చింది సార్ అంటూ చెప్పాడు. ఇది నేను అనలేదు.. సన్నీనే అన్నాడు అంటూ నాగార్జున ఫన్నీ సెటైర్ వేశారు. మొత్తానికి తను గేమ్ లో ఎలా ఉంటానో డైరెక్ట్ గా నాగార్జునకే చెప్పేశాడు సన్నీ. అదీ మేటర్.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus