Super Machi Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘సూపర్ మచ్చి’ ..!

  • January 22, 2022 / 01:44 PM IST

‘విజేత'(2018) చిత్రంతో హీరోగా పరిచయమైన మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్… ఆ చిత్రంతో పెద్దగా అలరించలేకపోయాడు. కొంత గ్యాప్ తర్వాత ఈ సంక్రాంతికి ‘సూపర్ మచ్చి’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రానికి పులి వాసు దర్శకుడు.’రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌ పై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రచితా రామ్ హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రానికి మొదటి నుండీ కనీసం బజ్ లేదు.ప్రమోషన్స్ కూడా పెద్దగా నిర్వహించలేదు.

మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఈ చిత్రం గురించి ఎక్కడా ఒక్క ట్వీట్ వేసిన దాఖలాలు కూడా లేవు.ఇక టాక్ కూడా జనాలను థియేటర్లకు రప్పించే విధంగా లేకపోవడంతో కలెక్షన్లు చాలా దారుణంగా నమోదు అయ్యాయి.వారం రోజులకే ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసింది. ‘సూపర్ మచ్చి’ క్లోజింగ్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం  0.15 cr
సీడెడ్  0.07 cr
ఆంధ్రా(టోటల్)  0.09 cr
ఏపి+తెలంగాణ (టోటల్)  0.31 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.01 cr
ఓవర్సీస్  0.01 cr
వరల్డ్ వైడ్ టోటల్  0.22 cr

‘సూపర్ మచ్చి’ చిత్రాన్ని చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.1.45 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.0.33 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం విడుదలైన రెండో రోజుకే చాల వరకు థియేటర్లలో ‘అఖండ’ ని ప్రదర్శించారు. ఇక హోల్డ్ చేసిన థియేటర్లలో కూడా ఆశించిన స్థాయిల్లో పెర్ఫార్మ్ చేయలేదు ‘సూపర్ మచ్చి’. మరి ‘కిన్నెరసాని’ చిత్రంతో అయినా కళ్యాణ్ దేవ్ హిట్టు కొడతాడేమో చూడాలి..!

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus