సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృష్ణ మొదట్లో నాటకాలు వేస్తూ అనంతరం పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు. అయితే తేనె మనసులు సినిమా ద్వారా హీరోగా అవకాశం అందుకున్నటువంటి ఈయన అనంతరం హాలీవుడ్ సినిమాల రేంజ్ లో జేమ్స్ బాండ్, కౌబాయ్ వంటి చిత్రాలను తెలుగు తెరకు పరిచయం చేశారు.ఇలా ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి కృష్ణ అద్భుతమైన ఆదరణ పొందారు.
ఈ విధమైనటువంటి విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.కృష్ణ గారికి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఎంతోమంది అభిమానులు ఉండడమే కాకుండా అక్కడ కూడా ఈయనకు అభిమాన సంఘాలు ఉండేవి.1964 నుంచి మొదలైనటువంటి ఆయన సినీ ప్రస్థానం దాదాపు 5 దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగే వారికి అభిమాన సంఘాలు ఉండడం సర్వసాధారణం
అయితే ఏ హీరోకి లేనన్ని అభిమాన సంఘాలు కృష్ణకు ఉండడం గమనార్హం ఈయనకు ఏకంగా 2400 అభిమాన సంఘాలు ఉండేవి అంటే ఈయన క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది. ఏ హీరోకి కూడా లేనన్ని అభిమాన సంఘాలు కృష్ణకు మాత్రమే ఉన్నాయి.ఇక ఈయన ఒకే ఏడాదిలో 18 సినిమాలను విడుదల చేసే రికార్డు సృష్టించారు. ఇలాంటి రికార్డు కేవలం కృష్ణ గారికి మాత్రమే సొంతమైందని చెప్పాలి.
ఇలా కృష్ణ సినీ కెరియర్లో ఏకంగా 80 మంది హీరోలతో కలిసి నటించగా అందులో ఎక్కువగావిజయనిర్మలతో కలిసి నటించారు. ఈయన విజయనిర్మలతో కలిసి 50 సినిమాలలో నటించి సందడి చేశారు. విజయనిర్మల తర్వాత జయప్రదతో 43, శ్రీదేవితో 31 సినిమాలలో నటించారు.ఇక సూపర్ స్టార్ కృష్ణ 16 సినిమాలకు దర్శకత్వం వహించగా ఆయన ఏకంగా 105 మంది దర్శకుల దర్శకత్వంలో సినిమాలు చేశారు. ఇలా అద్భుతమైన రికార్డులన్నీ కృష్ణ గారికి మాత్రమే సొంతమయ్యాయని చెప్పాలి.