ఫ్యాన్స్ కు మరో హార్ట్ బ్రేకింగ్ న్యూస్ సిద్ధం చేసిన రజినీ..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ 2020 ఎండింగ్ లో పెద్ద బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. సినిమాల ద్వారా ఎన్నో సంచలనాలు సృష్టించిన ఆయన.. రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అద్భుతాలు సృష్టిస్తారని అంతా భావించారు. ఈ విషయంలో తమిళ ప్రజల ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి.. రజినీ సినిమాల్లో రాజకీయాల ప్రస్తావన తీసుకొచ్చేవారు. అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని సినిమాల్లో రజినీ కాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రస్తావన ఉంటుంది.

2020లో రజినీ సొంత పార్టీ పెడతారని కూడా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా రజినీ అనారోగ్యం పాలవ్వడం.. చికిత్స కోసం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ అవ్వడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. రజినీ తన అనారోగ్యం కారణాన్ని ప్రధానంగా తీసుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేదే లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పుడు రజినీ మరో బాంబ్ పేల్చడానికి కూడా రెడీ అయినట్టు చెన్నై మీడియా వర్గాల సమాచారం.

వివరాల్లోకి వెళితే.. రజినీ తన సినిమా కెరీర్ కు కూడా గుడ్ బై చెప్పబోతున్నారట. ప్రస్తుతం రజినీ.. శివ డైరెక్షన్లో ‘అన్నాతె’ చిత్రం చేస్తున్నారు. ఇది పూర్తయ్యాక లారెన్స్ డైరెక్షన్లో సినిమా చేసే అవకాశం కూడా ఉందని టాక్. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే సినిమాల నుండీ కూడా రజినీ రిటైర్ అయ్యే అవకాశం ఉందని టాక్ బలంగా వినిపిస్తుంది. ఇది నిజమైతే.. రజినీ అభిమానులను ఇది మరింత నొప్పించే న్యూస్ అనే చెప్పాలి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus