సాహసానికి చిరునామాగా, తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డగా.. చిత్ర పరిశ్రమ మూలస్థంభాల్లో ఒకటిగా నిలిచిన.. ప్రేక్షకాభిమానుల మనసులు గెలిచిన నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు ప్రజలందర్నీ శోకసంద్రంలో ముంచేసి తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లిపోయారు.. ఆయన భౌతికంగా మనమధ్య లేకపోయినా.. చరిత్రలో మర్చిపోని జ్జాపకాలనెన్నిటినో మిగిల్చారు. అలాంటి వాటిలో కృష్ణ జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి తెలిస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు.. ఏకంగా ఒక సీఎంకే ఫోన్ చేసి తన కుమార్తె పెళ్లికి రావద్దని చెప్పారు కృష్ణ..
సూపర్ స్టార్ అంటేనే డేరింగ్ అండ్ డాషింగ్ కాబట్టి ఇదేదో సినిమాలోని సన్నివేశం అయింటుందిలే అనుకునేరు.. నిజంగా జరిగినదే.. వివరాల్లోకి వెళ్తే.. 1991 సంవత్సరం కృష్ణ తన పెద్ద కుమార్తె పద్మావతికి, గల్లా జయదేవ్‌తో పెళ్లి నిశ్చయించారు. సూపర్ స్టార్ స్వయంగా వెళ్లి.. సీఎం జయలలితను ఆహ్వానించారు. ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. అప్పటికే ‘గూఢచారి 116’, ‘దోపిడి దొంగలు’ లాంటి చిత్రాల్లో ఆయనతో నటించడం.. పైగా ఆయన వ్యక్తిం గురించి తెలుసు..
ఎలాగూ పెళ్లి చెన్నైలోనే కాబట్టి వస్తానని అన్నారట జయలిలత.. ఇక పెళ్లికి మూడు రోజుల ముందు జయలలిత సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి కృష్ణను కలిసి.. భద్రతా కారణాల వల్ల కళ్యాణ మండపంలోని మొదటి మూడు వరుసలు సీఎంకి కేటాయించాలని చెప్పారట.. ఒక్కసారిగా షాక్ అయిన కృష్ణ.. పెళ్లికి తెలుగు రాష్టాలనుండి ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్నారు.. వరుసగా మూడు లైన్లు పూర్తిగా కేటాయించడం కుదరదని ఆయనతో చెప్పి.. తర్వాత జయలలితకి కాల్ చేసి.. పరిస్థితిని వివరించారట.
మీరు పెళ్లికి రాకండి.. మీ ఆశీర్వచనాలు ఉంటే చాలని అన్నారట. పరిస్థితి అర్థం చేసుకున్న జయలలిత పెళ్లికి వెళ్లకుండానే ఆరోజు వధూవరులకు బొకేను పంపారు.. గల్లా జయదేవ్ పాపులర్ బిజినెస్ మెన్ కమ్ పొలిటిషియన్ అనే సంగతి తెలిసిందే.. పద్మావతితో ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు. ఇటీవలే కుమారుడు అశోక్ గల్లాని ‘హీరో’ మూవీతో ఇంట్రడ్యూస్ చేశారు.