తన సినీ కెరీర్లోని… బ్యాడ్ ఫేస్ గురించి చెప్పుకొచ్చిన సూపర్ స్టార్ కృష్ణ…!

సూపర్ స్టార్ కృష్ణ… 1970,80 ల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అనతికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.కృష్ణ గారు హీరోగా కెరీర్ ను ప్రారంభించిన టైం లో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు వంటి హీరోలు టాప్ లీడ్ లో కొనసాగుతున్నారు. అయితే కృష్ణ గారు అప్పటి ట్రెండ్ కు తగ్గట్టు సినిమాలు చేయడం మొదలుపెట్టాక ప్రేక్షకులంతా ఆయన వైపు తిరిగారు. అప్పటివరకు టాలీవుడ్లో రూపొందే సినిమాలు కొన్ని పరిమితులు కొద్దీ రూపొందేవి.

కానీ కృష్ణ గారు ఆ పరిమితులను చెరిపేశారు. విభిన్నమైన కథలు, కౌబాయ్, జేమ్స్ బాండ్ తరహా కథలను ఆరోజుల్లోనే ప్రేక్షకులకు అందించిన ఘనత కృష్ణగారిది. ‘సింహాసనం’ అనే చిత్రం అప్పట్లో ఓ బాహుబలి లాంటి సినిమా. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ చిత్రం ఎన్నో రికార్డులను తిరగరాసింది. అయితే ఎంతటి సూపర్ స్టార్లకి అయినా ఓ బ్యాడ్ ఫేస్ అనేది ఉంటుంది. కృష్ణ గారు అలాంటి బ్యాడ్ ఫేస్ లు ఎన్నో ఫేస్ చేశారు. అయితే ఆయన టాప్ హీరోగా కొనసాగుతున్న టైంలో వరుసగా 12 ప్లాపులు ఫేస్ చేశారట.

ఆ టైంలో కృష్ణ గారు ఇక హీరోగా పనికిరారు అని దర్శక నిర్మాతలు ఆయన్ని పక్కన పెట్టేశారట. ఈ క్రమంలో ఆయన తన సోదరుడు ఆదిశేషగిరిరావు ను నిర్మాత పరిచయం చేస్తూ సొంత బ్యానర్లో ‘పాడిపంటలు’ అనే సినిమా చేసినట్టు చెప్పుకొచ్చారు కృష్ణ. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. కృష్ణ గారికి మళ్ళీ పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ గా కొనసాగారు కృష్ణ. అయితే ఆయన ఫేస్ చేసిన బ్యాడ్ ఫేస్ విషయాన్ని… ఆయన తన కూతురు మంజుల తన యూట్యూబ్ ఛానల్ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మే 31న ఆయన పుట్టినరోజు కావడంతో మంజుల ఈ ఇంటర్వ్యూ నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus