‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే రాజమౌళి తన తరువాతి సినిమాని మహేష్ బాబుతో చెయ్యబోతున్నట్టు ప్రకటించాడు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీ ఇదని తెలుస్తుంది. రాజమౌళి తండ్రి విజయ భాస్కర్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం మొదలయ్యేలోపు సాధ్యమైనన్ని సినిమాలు చేసెయ్యాలని మహేష్ చూస్తున్నాడు. ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే కచ్చితంగా రెండు, మూడు సంవత్సరాలు టైం కేటాయించాల్సిందే. అందుకే మహేష్ తన అభిమానులను నిరాశపరచకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’ చిత్రం చేస్తున్న మహేష్ ఆ తరువాత ఏ దర్శకుడితో సినిమా చేసేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు.
రాజమౌళి తన సినిమాకి స్క్రిప్ట్ తయారు చేసుకోవడానికే ఏడాదికి పైగా టైం తీసుకుంటాడు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన తరువాత 3 నెలల పాటు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు ట్రిప్ కు వెళ్లాలని భావిస్తున్నాడట. సో 2022 నుండీ రాజమౌళి.. మహేష్ కోసం స్క్రిప్ట్ పనులు మొదలుపెడతాడు. అప్పటి నుండీ 2023 వరకూ టైం తీసుకుంటాడు. ఇక మహేష్ 2021 అక్టోబర్ కి ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ పూర్తిచేసేస్తాడు. కాబట్టి తరువాతి సినిమాని త్రివిక్రమ్ డైరెక్షన్లో చెయ్యాలని భావిస్తున్నాడు. అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల స్క్రిప్ట్ లకు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.
అయితే తాజాగా కొరటాల శివ కూడా మహేష్ బాబుని కలిసి కథ వినిపించాడట. అది కూడా మహేష్ కు నచ్చిందట. ఇప్పటివరకూ త్రివిక్రమ్ తో మాత్రమే సినిమా చెయ్యాలి అని ఫిక్స్ అయిన మహేష్ కు ఇప్పుడు కొత్త కన్ఫ్యూజన్ ఏర్పడింది. కొరటాల అంటే మహేష్ కు చాలా ఇష్టం. ‘సర్కారు వారి పాట’ స్క్రిప్ట్ విషయంలో కూడా కొరటాలను ఇన్వాల్వ్ చేసాడట మహేష్. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడా.. కొరటాలతో సినిమా చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.