Bigg Boss: సోషల్ మీడియాలో ఓకే..మరి హౌజ్ రాణించగలరా..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 త్వరలో టెలికాస్ట్ అవబోతుంది. గతంలో వచ్చిన ఆరు సీజన్లకు ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో తాజా సీజన్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుత సీజన్ కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ గా వ్యవహిస్తున్నారని తేలిపోయింది. గత సీజన్లకు భిన్నంగా ఈ సారి ఎంటర్టైన్మెంట్ బీభత్సంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోలు హోస్టులుగా వ్యవహరిస్తున్నారు.

త్వరలో ఏడో సీజన్ రాబోతుంది. అయితే ఈ సీజన్లో కంటెస్టెంట్ దగ్గర్నుండి.. గేమ్స్, టాస్క్ లన్నీ కూడా విభిన్నంగా ఉంటాయట. అటు నాగార్జున హోస్టింగ్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం. అంతకు ముందు బిగ్ బాస్ సీజన్ 1 కు జూ.ఎన్టీఆర్ హోస్ట్. రెండో ఎపిసోడ్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ తర్వాత నుంచి కింగ్ నాగార్జున వరుసగా హోస్టింగ్ బాధ్యతలు చేపడుతున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయినట్లు సమాచారం.

అయితే.. తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి తన కూతురు బిగ్ బాస్ హోస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సురేఖా వాణి కూతురు సినిమాల్లో కంటే సోషల్ మీడియాతో పాపులారిటీ సంపాదించుకుంది. తన కూతురితో కలిసి హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ హంగామా చేస్తుంటారు. తల్లి, కూతుర్లు కలిసి చేసిన రీల్స్ బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సురేఖ‌ కూతురు సుప్రీతతో కలిసి అమెరికాలో అట్లాంటిక్ సిటీలో సందడి చేస్తున్నారు.

ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నటి సురేఖ వాణి ఓ వీడియోను విడుదల చేసింది. ఇక గత కొంతకాలంగా వీరిద్దరూ బిగ్ బాస్ సీజన్ 7 లోకి రాబోతున్నారంటూ గాసిప్స్ వస్తున్నారు. నిజానికి సీజన్6 లోనే సురేఖ కంటెస్టెంట్ గా రావాల్సింది.. కానీ రాలేకపోయింది. ప్రస్తుతం తన కూతురు సుప్రీత సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సమయంలో పాపులారిటీ తనకు ఎంతైనా అవసరం. అందుకే ఈసారి పక్కాగా బిగ్ బాస్‌ (Bigg Boss) అవకాశం సురేఖకు దక్కకపోయినా సుప్రీతనైనా పంపాలని చూస్తుందట సురేఖ.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus