Suresh Babu: సమంత గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన చైతు మేనమామ.. ఏమన్నారంటే?

సమంత నాగచైతన్య ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే సమంత నాగచైతన్య 2021వ సంవత్సరంలో విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించి వీరిద్దరూ వారి వైవాహిక జీవితానికి బ్రేకప్ చెప్పారు.ఇలా విడాకులు తీసుకున్న అనంతరం విడాకుల విషయం గురించి సమంత పరోక్షంగా కామెంట్లు చేస్తూ వచ్చినప్పటికీ అక్కినేని కుటుంబం కానీ లేదా దగ్గుబాటి కుటుంబం గానీ ఎక్కడ ఈ విషయంపై స్పందించలేదు. ఇక నాగచైతన్యకు మేనమామల అయినటువంటి సురేష్ బాబు వెంకటేష్ వంటి వాళ్లు కూడా ఈ విడాకుల గురించి ఎక్కడ ప్రస్తావనకు తీసుకురాలేదు.

ఇకపోతే తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి సురేష్ బాబు అల్లు అరవింద్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ కార్యక్రమం ద్వారా బయటపెట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరు నిర్మాతలను బాలకృష్ణ ఒక టాస్క్ లో భాగంగా ఓ ప్రశ్న వేశారు. ఈతరం హీరోయిన్ గా ఉన్నటువంటి వారిలో మహానటి అనే బిరుదు ఎవరికి ఇస్తారని ప్రశ్నించగా అల్లు అరవింద్ సురేష్ బాబు ఇద్దరూ కూడా మూకుమ్మడిగా అలాంటి అర్హత కేవలం సమంతకు మాత్రమే ఉందని సమంత ఈ తరం మహానటి అంటూ కామెంట్ చేశారు.

ఈ విషయం గురించి సురేష్ బాబు మాట్లాడుతూ ఈ జనరేషన్లో ఉన్నటువంటి హీరోయిన్లలో మహానటి లాంటి గుర్తింపు సంపాదించుకునే అర్హత కేవలం సమంతకు మాత్రమే ఉందని ఈయన తెలిపారు. సురేష్ బాబు నాలుగు తరం హీరోయిన్లను చూసినవారు ఇలా ఈయన మహానటి సావిత్రితో సమంతను పోల్చడం అంటే మామూలు విషయం కాదు. ఇలా సురేష్ బాబు సమంత గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus