టాలీవుడ్ సీనియర్ నిర్మాతల్లో సురేశ్‌బాబు ఒకరు. హీరోలకు తగ్గట్టుగా తన దారిని చక్కగా మార్చుకుంటూ, మలచుకుంటూ నడుచుకుంటారని టాక్. ఎవరినీ నొప్పించకుండా, తన పని పూర్తయ్యేలా చూసుకుంటూ ఉంటారు. అందుకే ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉన్నారని చెబుతుంటారు. ఈ క్రమంలో ఆయన టర్న్‌లు తీసుకోవడం, మాటలు మలచడంతో చాలా బాగా చేస్తారంటారు. తాజాగా మరోసారి అలాంటి సిట్యువేషనే కనిపిస్తోంది. ఈసారి టాపిక్ టికెట్ ధరలు. మొన్నీ మధ్య ‘అన్‌స్టాపబుల్ 2’లో ఓ ఎపిసోడ్‌కి సురేశ్‌బాబు మరో ముగ్గురు అతిథులతో కలసి వచ్చారు.
ఈ క్రమంలో ఏవేవో మాట్లాడుతూ.. ‘విజయవాడకు గుంపులు గుంపులుగా వెళ్లిన బ్యాచ్’ గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలో ‘సినిమా టికెట్లు ఎప్పుడూ జనాలకు అందుబాటులో ఉండాలనే నా ఆలోచన’ అని చెప్పారు. దానికి బాలకృష్ణ కూడా అవును అనే సమాధానం ఇచ్చారు. అయితే పక్కనే ఉన్న గెస్ట్ మాత్రం సమర్థించలేదు. దీంతో ‘జనాలకు తక్కువ రేటుకే సినిమా ఇవ్వాలనే సురేశ్‌బాబు ఆలోచన గొప్పది’ అంటూ ప్రేక్షకులు గొప్పగా చెప్పుకొచ్చారు.
అయితే ఆయన ఇప్పుడు మళ్లీ మాట మార్చారు. ‘పెద్ద సినిమా అయితే సినిమా టికెట్ రేటు పెంచుకోవచ్చు’ అని అంటున్నారు. దానికి ఉదాహరణగా ‘అవతార్’ సినిమాను చూపించారు కూడా. ఆ సినిమా టికెట్‌ను రూ. రెండు వేలు నుండి రూ. 3 వేల వరకు అమ్ముతున్న విషయం తెలిసిందే. పెద్ద సినిమా, ఎక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి అలా పెంచేయొచ్చు అనేది సురేశ్‌బాబు మాట. అయితే ఇక్కడే నెటిజన్లు మరో మాట అంటున్నారు.
అప్పుడు ‘బ్యాచులు బ్యాచులుగా విజయవాడ వెళ్లింది కూడా భారీ చిత్రాల గురించే’ అని అంటున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు భారీ ఖర్చు పెట్టారు.. అంత ఖర్చు వెనక్కి రావాలంటే టికెట్ రేటు ఎక్కువగా ఉండాలి. అందుకే అప్పుడు ఇండస్ట్రీ నుండి బ్యాచులు బ్యాచులుగా విజయవాడ వెళ్లారు. ‘అవతార్’ స్థాయికి రూ. 3 వేలు ఎలా సరిపోతుందో, ‘ఆర్‌ఆర్‌ఆర్’ స్థాయికి రేటు పెంపు కూడా అంతే ముఖ్యం.
అయితే ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని అడ్డంగా వాడేసి.. చిన్న సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచింది కొంతమంది నిర్మాతలు. కాబట్టి ‘ఆ బెజవాడ బ్యాచులదేం తప్పులేదు’ అని నెటిజన్లు అంటున్నారు. సిట్యువేషన్‌కి తగ్గట్టు మాట మార్చేసి.. సురేశ్‌బాబు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయనకే తెలియాలి అనేది మరొకరి కామెంట్.