దివంగత స్టార్ ప్రొడ్యూసర్ డా.డి రామానాయుడు గారు ఆంద్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలో ఓ స్టూడియో నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ షూటింగ్ లు వంటివి ఏమీ జరగకపోయినా… భవిష్యత్తులో సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు మారాల్సి వస్తే దీని అవసరం ఉంటుందని రామానాయుడు గారు ఈ స్టూడియోని నిర్మించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ స్టూడియోని తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మీడియాలో కథనాలు వినిపించాయి. ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కేంద్రపాలిత ప్రాంతంగా దీనిని మలచాలని యోచిస్తున్నట్టు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది.
ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వైజాగ్ ను తీర్చిదిద్దడమే పనిగా అక్కడి ప్రభుత్వం పని చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. అందుకు సువిశాల ప్రాంతంలో మంచి భవంతులు కావలి. అందుకోసం రామానాయుడు స్టూడియో పై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం పై సురేష్ బాబు అండ్ టీం క్లారిటీ ఇచ్చారు.’గతంలో ఏపీ ప్రభుత్వం నుండీ ఈ ప్రతిపాదన వచ్చిన మాట నిజమే… ప్రత్యామ్న్యాయంగా వేరే స్థలాన్ని ఇస్తామని కూడా ఆఫర్ వచ్చింది.
కానీ అందుకు మేము ఒప్పుకోలేదు. తర్వాత ప్రభుత్వం నుండీ మళ్ళీ అలంటి ప్రొపోజల్ రాలేదు’ అంటూ వారు క్లారిటీ ఇచ్చారు. అయితే ‘ప్రభుత్వం మళ్ళీ ఎటువంటి ప్రపోజల్ సురేష్ బాబు దృష్టికి తీసుకురాలేదు అంటే.. రామానాయుడు స్టూడియోస్ ని స్వాధీనం చేసుకునే కుట్రలు పన్నుతున్నారేమో’ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!