ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయంపై సినిమా ఇండస్ట్రీ నుంచి విమర్శలు వస్తున్నాయి. మరోసారి ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి ప్రభుత్వంపై చర్చలు జరపాలని చూస్తున్నారు. కానీ ప్రభుత్వమైతే నిర్ణయం తీసేసుకుంది. టికెట్ రేట్ల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. ప్రభుత్వం చెప్పిన రేటుకే టికెట్లను అమ్మాల్సి ఉంటుంది. దీనిపై తాజాగా సురేష్ బాబు సంచలన కామెంట్స్ చేశారు. ఒక ప్రొడక్ట్ ను తయారు చేసుకున్నవాడికే దాని రేటు దీక్ష చేసుకునే హక్కు ఉంటుందని…
సినిమా కూడా అంతేనని అన్నారు. టికెట్లను తక్కువ రేట్లకు అమ్మి థియేటర్లను ఎలా నడిపించాలని ప్రశ్నించారు సురేష్ బాబు. ఇలానే నడిపిస్తే కరెంట్ బిల్స్ కూడా కట్టలేని పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వల్ల దెబ్బతిన్న థియేటర్ల వ్యవస్థను ఆదుకోవడానికి కరెంట్ బిల్స్ మాఫీ చేస్తామని చెప్పినా.. ఇంతవరకు చేయలేదని చెప్పారు సురేష్ బాబు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నో సార్లు అడిగామని.. సినిమా ఇండస్ట్రీ అంటే అందరికీ గౌరవం ఉంది.
అందరూ బాగానే మాట్లాడతారు కానీ పనుల్లోకి వచ్చేసరికి అది కనిపించడం లేదని చెప్పారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇండస్ట్రీని పట్టించుకోవడం లేదని కామెంట్స్ చేశారు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంత రెవిన్యూ వస్తుంది..? టాక్సుల రూపంలో ఎంత వస్తుందని చూడొద్దని.. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందితే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?