12వ తరగతి పరీక్షల్లో సత్తా చాటిన ధనుష్, సూర్య పిల్లలు.. ఎన్ని మార్కులంటే?

సాధారణంగా సెలబ్రిటీల పిల్లలు అంటే పెద్దగా చదవడానికి ఆసక్తి చూపరని చదువుల్లో మంచి మార్కులు సాధించరని చాలామంది భావిస్తారు. అయితే సూర్య (Suriya) జ్యోతికల (Jyothika) కూతురు, ధనుష్ (Dhanush) ఐశ్వర్యల (Aishwarya Rajinikanth) కొడుకు మాత్రం పరీక్షలలో మంచి మార్కులు సాధించి వార్తల్లో నిలిచారు. 12వ తరగతి పరీక్షల్లో ధనుష్, సూర్య పిల్లలు సత్తా చాటడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. సూర్య జ్యోతికల కూతురు దియా పరీక్షల్లో 600కు 581 మార్కులు సాధించింది.

కంప్యూటర్ సైన్స్ లో 97, కెమిస్ట్రీలో 98, ఫిజిక్స్ లో 99, మ్యాథ్స్ లో 94, ఇంగ్లీష్ లో 97, తమిళంలో 96 మార్కులు దియా సాధించినట్లు తెలుస్తోంది. దియాకు పరీక్షల్లో మంచి మార్కులు రావడం కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు ధనుష్ ఐశ్వర్యల కొడుకు యాత్ర 12వ తరగతి ఫలితాల్లో 600కు 569 మార్కులు సాధించారని భోగట్టా.

యాత్రకు అన్ని సబ్జెక్ట్ లలో 90 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని తెలుస్తోంది. సూర్య, ధనుష్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా పిల్లల చదువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్లను ప్రయోజకులను చేసే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. సూర్య ప్రస్తుతం కంగువ (Kanguva) సినిమాతో బిజీగా ఉండగా ధనుష్ ప్రస్తుతం కుబేర సినిమాతో బిజీగా ఉన్నారు.

ఈ రెండు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కంగువ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా కుబేర సినిమాలో ధనుష్ మాత్రం నాగార్జునతో (Nagarjuna) కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ గా నిలుస్తాయో చూడాలి. ఈ ఇద్దరు స్టార్ హీరోలకు సోషల్ మీడియాలో సైతం క్రేజ్ పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus