‘రెట్రో’ (Retro) సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఎందుకు హాజరయ్యాడు. ఇద్దరికీ గతంలో పెద్ద అనుబంధం ఉన్నట్లు అయితే మనకు తెలియదు. మరి ఎందుకు వచ్చాడు? ఈ ప్రశ్న మీకేమైనా మనసులో మెదిలిందా? దీనికి ఇమ్మీడియట్ ఆన్సర్‌గా చాలామంది చెప్పేది ‘సితార’ నాగవంశీ (Suryadevara Naga Vamsi) వల్ల వచ్చి ఉంటాడు అని. ‘రెట్రో’ సినిమాను తెలుగులో ‘సితార’ రిలీజ్ చేస్తోంది. ప్రస్తుతం విజయ్ సితార బ్యానర్ మీద ‘కింగ్ డమ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ లింక్ వల్లే వచ్చి ఉంటాడు అని.
అయితే, ఆ లింక్‌తో పాటు మరో అంశం కూడా ఉంది అని సమాచారం. అదే విజయ్ కొత్త సినిమా కోసం సూర్య (Suriya) కీలకంగా పని చేశాడు అని. మీరు చదివింది నిజమే. విజయ్ నెక్స్ట్ సినిమా ‘కింగ్ డమ్’లో విజయ్ పాత్రకు సూర్యనే తమిళ డబ్బింగ్ చెప్పాడు అని అంటున్నారు. అయితే ఈ విషయంలో క్లారిటీ లేదు. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది అని చెబుతున్నారు. ‘కింగ్‌డమ్’ (Kingd0m) సినిమాను. మే 30న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో విడుదల చేయనున్నారు.
ఒకవేళ ఇదే కనుక జరిగితే.. మే 1న విడుదలయ్యే ‘రెట్రో’ సినిమా విజయం సాధిస్తే.. ‘కింగ్‌డమ్’ విషయంలో విషయంలో భారీ అంచనాలు ఏర్పడతాయి. విజయ్ దేవరకొండ ప్రస్తుత కెరీర్ దృష్ట్యా ఈ సినిమా విజయం చాలా కీలకం. ఇక రెట్రో సినిమా సంగతి చూస్తే.. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటించింది. అయితే ఆమె ప్రీరిలీజ్ ఈవెంట్‌కి హాజరు కాలేదు.
తమిళంలో ఆమ పెద్ద స్థాయిలో ప్రమోషన్స్‌లో పాల్గొనడం గమనార్హం. ఇక సితార బ్యానర్‌లో సూర్య ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుంది. ఓ కార్ల కంపెనీ యజమాని జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది అని సమాచారం.