Suriya: అభిమానితో సూర్య తండ్రి దురుసు ప్రవర్తన.. ఆయన క్లారిటీ ఇదే!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తమిళనాడులో, తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. సూర్య సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం. సూర్య ప్రస్తుతం కంగువా అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే తాజాగా సూర్య తండ్రి ఒక వివాదంలో చిక్కుకోవడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. సూర్య తండ్రి శివకుమార్ సైతం సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే ఒక అభిమానితో సూర్య తండ్రి దురుసుగా ప్రవర్తించారని వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఒక అభిమాని శాలువా కప్పడానికి వెళ్తే శివకుమార్ ఆ శాలువాను విసిరేశారు. శివకుమార్ ఆ విధంగా చేయడం సోషల్ మీడియా వేదికగా వైరల్ కాగా నెటిజన్లు ఆయనపై విమర్శలు చేశారు. ఈ విమర్శలు ఎక్కువ కావడంతో ఆయన ఈ వివాదం గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. నాకు శాలువా ఇచ్చిన వ్యక్తి పేరు కరీమ్ అని నేను, అతను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని వెల్లడించారు. కానీ కొత్తగా అతను నా కోసం శాలువా తీసుకొచ్చాడని ఇదంతా నచ్చక శాలువా తిరిగిచ్చేయడం జరిగిందని శివకుమార్ పేర్కొన్నారు.

ఈ ఘటన జరిగిన సమయంలో సరిగ్గా రెస్ట్ లేకపోవడం వల్ల స్పీచ్ కష్టంగా ఇచ్చానని ఆయన తెలిపారు. అన్నీ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న సమయంలో కరీమ్ శాలువా కప్పాడని శివకుమార్ అన్నారు. ఆ వ్యక్తి నా స్నేహితుడు అయినప్పటికీ శాలువా పడేయడం తప్పేనని అలా చేసినందుకు క్షమాపణలు చెబుతున్నానని ఆయన కామెంట్లు చేశారు.

శివకుమార్ చెప్పింది నిజమేనని తప్పుడు ప్రచారం చేయవద్దని కరీమ్ మనవడు రియాఫ్ అన్నారు. శివకుమార్, రియాఫ్ క్లారిటీతో ఇకనైనా ఈ వివాదం ఆగుతుందేమో చూడాల్సి ఉంది. శివకుమార్ వివాదాలకు దూరంగా ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు. సూర్య (Suriya) మాత్రం ఈ ఘటన గురించి రియాక్ట్ కాలేదు.

https://youtu.be/efgT_5bFU-4

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus