Suriya: సూర్య కోసం భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ రెడీ.. గూస్‌ బంప్స్‌ పక్కా

ఓ సీన్‌ చెబుతాం.. దాన్ని ఓసారి ఊహించుకోండి. పర్‌ఫెక్ట్‌గా ఊహించుకుంటే మాత్రం గూస్‌ బంప్స్‌ పక్కా. ఇప్పుడు అసలు పాయింట్‌.. మధ్యలో మీ అభిమాన హీరో, చుట్టూ 200 మంది బాడీ బిల్డర్లు వారితో ఆ హీరో ఫైట్‌. ఫ్రేమ్‌ అదిరిపోయింది కదా. ఆ ఫ్రేమ్‌ మధ్యలో ఉన్న హీరో సూర్య అయితే ఇంకా సూపర్‌ అని చెప్పాలి. ఇప్పుడు ఊహలో ఉన్న ఈ సీన్‌ను నిజం చేయబోతున్నారు దర్శకుడు శివ. అంతేకాదు ఇప్పటికే ఈ సీన్‌ షూటింగ్‌ కూడా మొదలైందట.

సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. గ్రీన్‌ స్టూడియో, యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దిశా పటానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. అందులో భాగంగా 200 మంది బాడీబిల్డర్లతో ఓ భారీ పోరాట సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారట. అంటే 200 మంది మల్లయోధులతో సూర్య తలపడే సీన్స్‌ రూపొందిస్తున్నారట. ఈ సీన్‌ సినిమాకి కీలకంగా ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.

ఈ భారీ యాక్షన్‌ సీన్‌ని సుప్రీమ్‌ సుందర్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీలో తెరకెక్కిస్తున్నారట. ఈ సీన్‌ను షూటింగ్‌లో చూసినవాళ్లే గూస్‌ బంప్స్‌ సీన్‌ అంటున్నారు అంటే.. మరి బిగ్‌ స్క్రీన్‌పై చూస్తే ఇంకెలా ఉంటుందో అని ఫ్యాన్స్‌ ఎగ్జైట్‌ అవుతున్నారు. శివ సినిమా అంటేనే యాక్షన్‌ ప్యాక్డ్‌ ఉంటుంది. అందులో సూర్యతో కలిసేసరికి ఆ యాక్షన్‌ డబుల్‌, ట్రిపుల్‌ అయినట్లుంది. అందుకే ఈ భారీ సీన్‌ రాసుకున్నారు. ఇప్పుడు అదే స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. పునర్జన్మ నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికరమైన పాయింట్‌ ఈ సినిమా రూపొందుతోందట. అంతేకాదు భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. అన్నట్లు ఈ సినిమాలో సూర్య ఐదు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడట. త్రీడీలో రూపొందుతున్న ఈ సినిమా దాదాపు పది భాషల్లో విడుదల చేస్తారట.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus