సినిమాల్లో మల్టీస్టారర్‌లు అంటే ఒకప్పుడు చాలా పెద్ద విషయం. అయితే ఇప్పటి దర్శకుల ఆలోచనలు, రచనలు మల్టీస్టారర్‌లను ఈజీ చేసేస్తున్నారు. మల్టీవెర్స్‌లు, సినిమాటిక్ యూనివర్స్‌లు అంటూ ఒక సినిమాలో మరో సినిమా, ఒక హీరోను పాత్రను మరో సినిమాలోనూ తీసుకొస్తున్నారు. టీవీ సీరియల్స్‌లో ఓ సీరియల్ టీమ్, మరో సీరియల్‌లోకి వచ్చినట్లు అన్నమాట. అలా లోకేశ్ కనగరాజ్ చేసిన ఓ ప్రయత్నంతో ఎనిమిదేళ్ల క్రితం సూర్య అన్న మాట ఇప్పడు నిజమయ్యేలా చేస్తోంది.
సినిమాల్లోకి కార్తి వచ్చిన తొలి రోజుల్లో సూర్య మాట్లాడుతూ తమ్ముడితో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాను. అందులో కార్తి నామాలు పెట్టుకుని హీరోలా ఉంటే, నేను విలన్‌గా చేస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత అలా ఏళ్లు గడుస్తున్నాయి. ఏ దర్శకుడూ అలాంటి కథతో ముందుకు రాలేదు. దీంతో సూర్య చెప్పిన మాట ఇంత త్వరగా నిజమవ్వదా? అస్సలు అవ్వదా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే లోకేశ్ కనగరాజ్ వల్ల ఇది కుదరుతోంది.
కార్తితో ‘ఖైదీ’ సినిమా చేసిన లోకేశ్ కనగరాజ్.. ఇటీవల ‘విక్రమ్’గా కమల్ హాసన్‌ను చూపించారు. ఈ సినిమా విడుదలకు ముందే ఈ రెండు లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లోనివే అనే వార్త వచ్చింది. అంటే ఈ రెండు ఒకే కాలానికి సంబంధించినవి, అలాగే రెండింటి మధ్య సంబంధం ఉంటుందని, ఆ తర్వాత వీటి నేపథ్యంలో మరికొన్ని సినిమాలొస్తాయి అని అర్థం. ఇప్పుడు ఈ యూనివర్శ్‌లో ‘ఖైదీ 2’ సిద్ధం చేయనున్నారు. ఇందులో కార్తి అలియాస్ డిల్లీ సూర్య అలియాస్ రోలెక్స్ మధ్య ఫేస్ ఆఫ్ ఉండనుందట.
‘ఖైదీ’లోని కార్తి పాత్రకు నామాలుండి, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కనిపిస్తాడు. ‘విక్రమ్’లో రోలెక్స్‌గా విలనిజం చేశాడు సూర్య. ఇప్పుడు లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘ఖైదీ 2’ వస్తే అందులో కార్తి హీరో, సూర్య విలన్ అవుతాడు. దీంతో ఎనిమిదేళ్ల క్రితం సూర్య చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈజ్‌గా ఇప్పుడు వర్కౌట్ అవుతున్నాయి.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!