Suriya: ఆ విషయంలో మీరు ఎప్పుడు బెస్ట్ !

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా చాలామంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక సూర్య తమిళంలో నటించిన సినిమాలన్నింటినీ కూడా తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తారు. అయితే తెలుగు హీరోల మాదిరిగానే ఈ సినిమాలో కూడా కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఇక సూర్య పుట్టినరోజు వేడుకలను కూడా తెలుగు అభిమానులు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ సూర్య పట్ల అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురు స్టార్ హీరోల సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ అనే సినిమాని కూడా తిరిగి విడుదల చేశారు.2008వ సంవత్సరంలో గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో సూర్య (Suriya) సిమ్రాన్ సమీరారెడ్డి ప్రధాన పాత్రలలో ఈ సినిమా విడుదలైంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమాని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు కూడా తెలుగు హీరోల సినిమాలకు వచ్చిన స్థాయిలోనే ఆదరణ వస్తోంది.ఈ సినిమా థియేటర్లలో ప్రసారమవుతున్న సమయంలో ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తూ సినిమాని చూశారు. ఈ క్రమంలోనే థియేటర్లలో ప్రేక్షకులు గోల చేస్తున్నటువంటి ఒక వీడియోని చూసిన సూర్య ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… ఈ ప్రేమ నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. సూర్య సన్నాఫ్ కృష్ణన్ టీం నుంచి స్పెషల్ థ్యాంక్స్. సినిమాని ఎంజాయ్ చేయడంలో మీరు బెస్ట్ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక సూర్య సినిమాలో మాత్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus