కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’, ‘జైభీమ్’ సినిమాలు ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీల్లో విడుదలైనప్పటికీ.. దేశవ్యాప్తంగా ఈ సినిమాలకు గుర్తింపు లభించింది. ముఖ్యంగా ‘జైభీమ్’ సినిమా ఐఎండీబీ రేటింగ్స్‌లో హాలీవుడ్ క్లాసిక్ హిట్ ‘ది షాషాంక్ రిడంప్షన్’ చిత్రాన్ని అధిగమించి 73 వేలకుపైగా ఓట్లతో 9.6 రేటింగ్ సాధించింది. ఇప్పటివరకు ఏ సౌత్ సినిమాకు ఇలాంటి రేటింగ్ రాలేదు.
అలానే గోల్డెన్ గ్లోబ్ 2022 పురస్కారానికి కూడా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది ఈ సినిమా. ఇటీవల అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్) అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ‘సీన్ ఎట్ ది అకాడమీ’ పేరుతో ఈ సినిమాలోని ఓ వీడియోను పోస్ట్ చేశారు.ప్పుడు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ఆస్కార్ 2022 అవార్డ్స్ కి నామినేట్ అయింది ‘జైభీమ్’. జస్టిస్ చంద్రు అనే అడ్వకేట్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.
కథ ప్రకారం.. ఓ గిరిజన మహిళ చేసే పోరాటానికి అండగా నిలుస్తాడు హీరో. ప్రయోగాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించి భారీ హిట్టు అందుకున్నారు. ‘జైభీమ్’తో పాటు మోహన్ లాల్ ‘మరక్కార్’ సినిమా కూడా ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచింది. 16వ శతాబ్దపు చారిత్రాత్మక పాత్ర కుంజలి మరక్కార్ కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో మోహన్ లాల్ టైటిల్ రోల్ పోషించారు. ఆయన తనయుడు ప్రణవ్ యంగేజ్ లో ‘మరక్కార్’ పాత్రను పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలవడం విశేషం.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!