Kanguva: సూర్య కంగువ స్టోరీ లైన్ ఇదేనా.. ఆ సినిమాలా ఉండబోతుందా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం కంగువ (Kanguva) అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. కంగువ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదల కాగా ఈ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. బింబిసార (Bimbisara) సినిమాలా ఈ సినిమాలో కూడా గతం నుంచి వర్తమానంలోకి హీరో వస్తాడని భోగట్టా.

సూర్య ఈ సినిమాలో ట్రైబల్ వారియర్ రోల్ లో కనిపించనున్నారు. పీరియాడికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒక సైంటిస్ట్ సహాయంతో సూర్య వర్తమానంలోకి వచ్చి తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారని భోగట్టా. బింబిసారలో హీరో పాత్రలా ఈ సినిమాలో హీరో రోల్ ఉంటుందని సమాచారం అందుతోంది. కంగువ సినిమా పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో త్వరలో విడుదల కానుంది.

కంగువ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సూర్య ఈ సినిమా కోసం పడిన కష్టం మామూలు కష్టం కాదని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కినా అంచనాలను అందుకోలేదు. అయితే కంగువ మాత్రం ష్యూర్ షాట్ హిట్ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు.

తెలుగులో కూడా మరికొన్ని నెలల పాటు పాన్ ఇండియా సినిమాలేవీ రిలీజ్ కావట్లేదు. ఇలాంటి సమయంలో కంగువ విడుదలైతే మాత్రం ఆ సినిమాకు కలెక్షన్ల పరంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు పాన్ ఇండియా హిట్లు దక్కలేదు. ఈ ఏడాది సూర్య నటించిన రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. సూర్య సుధా కొంగర కాంబో మూవీ వేర్వేరు కారణాల వల్ల ఆగిపోయింది.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus