కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya), టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘ఫార్చ్యూన్ ఫోర్’ బ్యానర్ పై సాయి సౌజన్య కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో సూర్య చేస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. 70 నుండి 90 రోజుల్లో ఈ ప్రాజెక్టుని ఫినిష్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అన్నీ అనుకున్నట్టు అయితే ఈ ఏడాది చివర్లో లేదా 2026 సంక్రాంతి బరిలో దించాలనే ప్లాన్ కూడా టీంకి ఉంది. అది అంత ఈజీ కాకపోయినా.. అదే లక్ష్యంతో షూటింగ్ నిర్వహించబోతున్నారు అని తెలుస్తుంది. ఇది పక్కన పెట్టేస్తే.. సూర్య (Suriya) – వెంకీ అట్లూరి సినిమా పూజా కార్యక్రమాలతో ఇలా ప్రారంభమైందో లేదో… అప్పుడే ఈ ప్రాజెక్టుకి క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ హక్కులు…
నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ.90 కోట్లకు కొనుగోలు చేసిందట. సూర్యకి ఈ సినిమా కోసం రూ.50 కోట్లు పారితోషికం ఇస్తున్నారు. అంటే అతని పారితోషికం వెనక్కి వచ్చేసినట్టే..! వెంకీ అట్లూరి ఈ సినిమా కోసం రూ.15 కోట్లు పారితోషికం అలాగే లాభాల్లో వాటా అడిగారట. అంటే అతని మొత్తం పారితోషికం రూ.20 నుండి రూ.25 కోట్ల వరకు ఉంటుంది. సినిమాకు సంబంధించి ఇతర నటీనటుల పారితోషికాలు అలాగే మేకింగ్ కాస్ట్ కు మరో రూ.60 కోట్లు అవ్వొచ్చు అని సమాచారం.
‘Suriya 46’ pooja ceremony #Suriya46 #VenkyAtluri #Suriya #NagaVamsi pic.twitter.com/qZZea14uzN
— Phani Kumar (@phanikumar2809) May 19, 2025
‘Suriya 46’ pooja ceremony #Suriya46 #VenkyAtluri #Suriya #NagaVamsi pic.twitter.com/qZZea14uzN
— Phani Kumar (@phanikumar2809) May 19, 2025