Vivek Athreya: దర్శకుడు వివేక్ ఆత్రేయ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

తాజాగా ‘సింగిల్’ (#Single) సక్సెస్ మీట్ జరిగింది. దీనికి చిత్ర బృందంతో పాటు గెస్ట్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కూడా వచ్చాడు. తన కెరీర్ ప్రారంభంలో శ్రీవిష్ణు (Sree Vishnu) చేసిన సాయం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ… ” నేను ‘మెంటల్ మదిలో’ (Mental Madhilo) సినిమా చేశాను. తర్వాత రెండో సినిమాగా ‘బ్రోచేవారెవరురా’ (Brochevarevarura) చేయాలని అనుకున్నాను. కానీ ఆ కథ చెబుతుంటే నిర్మాతలు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

Vivek Athreya

దగ్గర దగ్గర 5 మంది నిర్మాతలు ఆ కథని రిజెక్ట్ చేశారు. చాలా మందికి ఆ కథ అర్థం కాలేదు. నాకేమో అదే కథ చేయాలని ఉంది. అయితే తెలిసిన వాళ్ళు కొంతమంది ‘నువ్వు రామ్ కామ్స్ బాగా చేస్తున్నావ్ కదా అలాంటి కథే చూడు’ అన్నారు. దీంతో ఆ కథ పక్కన పెట్టేయలేమో అని అనుకున్నాను. అలాంటి టైంలో శ్రీవిష్ణు భయ్యా వచ్చి ‘నీకు ఆ కథ చేయాలని ఉంది కదా.. నేను ఒక ప్రొడ్యూసర్ ని తీసుకొస్తా’ అని చెప్పి.. దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లారు.

అలా ఆ కథను మొదట నమ్మింది శ్రీవిష్ణు గారు. పేపర్ పై దాన్ని ఎవరూ నమ్మలేదు. అయితే ‘బ్రోచే..’ వల్లే నాకు గుర్తింపు వచ్చింది. ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) వంటి సినిమాలు చేసే అవకాశాలు వచ్చాయి. తర్వాత నేను సంక నాకి పోయే పరిస్థితుల్లో ఉంటే నా దగ్గరకు రా.. నా సొంత బ్యానర్లో నేను సినిమా చేస్తాను అని శ్రీవిష్ణు అన్న నాకు ధైర్యం ఇచ్చారు” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

సినీ పరిశ్రమలో విషాదం.. నటుడి తల్లి మృతి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus