‘జై భీమ్’ సినిమా సూర్యకి మంచి పేరు తీసుకొచ్చింది. తొంభైలలో జరిగిన ఓ నిజజీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సూర్య ఇందులో చంద్రు అనే పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు సూర్య. అయితే ఈ సినిమా విషయంలో కొన్ని చుట్టుముట్టాయి. ‘వన్నియార్’ అనే కులాన్ని కించపరిచేలా ఓ సన్నివేశం ఉందని.. ఆ కులస్థులు సూర్యను వివాదంలోకి లాగారు. ఈ విషయంలో చాలా మంది సూర్యకు మద్దతు తెలిపారు.
ఇందులో సూర్య తప్పేమీ లేదని వాదించారు. పైగా సూర్య ఆ సన్నివేశాన్ని సినిమా నుంచి తీయించేయడంతో అతడికి మరింత సపోర్ట్ లభించింది. ఈ విషయంలో సూర్య తప్పు లేదనిపించినా.. మరో విషయంలో మాత్రం అతడికి విమర్శలు తప్పడం లేదు. లాకప్ డెత్ కేసుకి సంబంధించి తమిళంలో చాలా వరకు నిజ జీవిత పాత్రల పేర్లనే సినిమాలో పెట్టారు. చంద్రు అనే లాయర్ పాత్రలో సూర్య నటించాడు. సినిమాలో ఆయన పేరు కూడా అదే.
అలానే లాకప్ డెత్ బాధితుడిగా రాజా కన్ను, అతడి భార్యగా సెంగిని పేర్లను కూడా సినిమాలో అలానే ఉంచారు. కానీ రాజా కన్నుతో పాటు మరో ఇద్దరి పట్ల కిరాతకంగా వ్యవహరించి ఈ లాకప్ డెత్‌కు కారణమైన వ్యక్తి పేరును మాత్రం సూర్య టీమ్ మార్చేసింది. ఒరిజినల్ గా ఆ వ్యక్తి ఆంటోనీ స్వామీ అనే క్రిస్టియన్ కాగా.. సినిమాలో మాత్రం హిందువు పేరు పెట్టారు. దీంతో హిందూ సపోర్టర్స్ మండిపడుతున్నారు. ఈ విషయంలో సూర్య కూడా సైలెంట్ గా ఉన్నాడు.