నిన్న బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి సినీలోకం ఒక్క సరిగా షాక్ కి గురైంది. మంచి భవిష్యత్ కలిగిన ఓ యంగ్ హీరో ఇలా ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలచివేసింది. కాగా సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ మరణం 2014లో జరిగిన ఉదయ్ కిరణ్ ఉదంతాన్ని గుర్తు చేసింది. ఉదయ్ కిరణ్ కూడా తక్కువ ఏజ్ లో ఆత్మ హత్య చేసుకున్నారు. ఉదయ్ కిరణ్ అర్ధాంతరంగా అలా తనువు చాలించి అందరినీ విషాదంలో నెట్టివేశారు.
కాగా ఈ ఇద్దరు యంగ్ హీరోల మరణాలకు చాలా పోలికలు ఉండడం యాదృచ్చికం అని చెప్పాలి.
ఉదయ్ కిరణ్ మరియు సుశాంత్ ఉరి వేసుకొని చనిపోయారు. అది కూడా వారి సొంత నివాస భవనాలలో.
వీరిద్దరి మరణానికి కారణం కూడా డిప్రెషన్ కావడం గమనార్హం. సినిమా అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉదయ్ కిరణ్ మరణించగా, సుశాంత్ ని ఒంటరి తనం, వాళ్ళ అమ్మ జ్ఞాపకాలు బలితీసుకున్నాయి. కారణాలు వేరైనా డిప్రెషన్ వలన వీరిద్దరూ ఆత్మ హత్య చేసుకున్నారు.
ఈ ఇద్దరు యంగ్ హీరోలు ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలో హీరోలుగా ఎదిగారు. ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ చేయబడిన ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇక సుశాంత్ కి కూడా ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. స్వయం కృషితో బాలీవుడ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక ఉదయ్ కిరణ్, సుశాంత్ ల తల్లులు లేరు. ఉదయ్ కిరణ్ తల్లి 2006లో చనిపోగా, సుశాంత్ తల్లి 2002లో ఆయన టీనేజ్ లో ఉన్నప్పుడే మరణించింది. వీరిద్దరూ తండ్రులకు దూరంగా ఉండడం కూడా యాదృచ్చికమే.
మరణించే నాటికి వీరి వయసు కూడా దాదాపు ఒకటే. 1980లో పుట్టిన ఉదయ్ కిరణ్ 34ఏళ్ల వయసులోనే 2014లో ఆత్మ హత్య చేసుకున్నారు. ఇక 1986లో పుట్టిన సుశాంత్ 34ఏళ్ల వయసులో 2020లో ఆత్మ హత్య చేసుకున్నారు.
ఈ ఇద్దరు యంగ్ హీరోలకు ఉన్న మరో పోలిక చదువులో కూడా టాపర్స్ అని తెలుస్తుంది.