కొత్త హీరోలు ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్న టైములో హీరో సుశాంత్ ను చాలా మంది ప్రేక్షకులు మర్చిపోయారనే చెప్పాలి. కానీ ‘చి.ల.సౌ’ అనే చిత్రం ఇతనికి మళ్ళీ హోప్ ను ఇచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సుశాంత్ కు బాగా హెల్ప్ అయ్యింది. ఈ మూవీ ద్వారానే ఇతను ‘అల వైకుంఠపురములో’ వంటి నాన్- బాహుబలి ఇండస్ట్రీ హిట్లో భాగమయ్యే అవకాశం సంపాదించుకున్నాడట. రేపు విడుదల కాబోతున్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుశాంత్ ఈ విషయాన్ని తెలియజేసాడు.
సుశాంత్ మాట్లాడుతూ.. ” ‘చి.ల.సౌ’ మూవీని బన్నీ ఫస్ట్ చూశారు. తర్వాత ఆయన త్రివిక్రమ్ గారికి చెప్పారు. త్రివిక్రమ్ గారు సినిమా వెంటనే నాకు ఫోన్ చేశారు. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ఉన్న ప్రాముఖ్యమైన పాత్ర గురించి నాకు చెప్పారు. అల ‘చి.ల.సౌ’ ద్వారా ‘అల వైకుంఠపురములో’ మూవీ చేసే ఛాన్స్ లభించింది. ఆ మూవీ తరువాత స్ప్రైట్ యాడ్ చేసే అవకాశం కూడా వచ్చింది. అలా నాకు దగ్గరకు వచ్చిన ప్రతీ మూవీ చేస్తూ పోవాలని డిసైడ్ అయ్యాను.
‘చి.ల.సౌ’ కంటే ముందే దర్శకుడు ఎస్.దర్శన్ నాకు ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ కథ చెప్పారు.. సుశాంత్” చెప్పుకొచ్చాడు. ఇక ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీని నటి భానుమతి రామకృష్ణ మనవడు రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్లలతో కలిసి ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్‌పై ఈ నిర్మించడం విశేషం.