Sushmita Sen: మెడికల్‌ రిపోర్ట్‌లో అంతా బాగానే ఉందన్నారు… కానీ: స్టార్‌ నాయిక

ప్రముఖ బాలీవుడ్‌ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌కు ఇటీవల గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. ఫిట్‌నెస్‌, డైట్‌ అంటూ చాలా జాగ్రత్తలు తీసుకునే ఆమెకు ఎందుకు గుండెపోటు వచ్చింది అనే డౌట్‌ చాలామందికి వచ్చింది కూడా. అయితే ఇప్పుడు సుస్మిత కోలుకుంది. తన గుండె పోటు గురించి ఇటీవల ఓ మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలో ఎందుకు, ఏం జరిగింది అనే విషయాలను చెప్పుకొచ్చింది. మార్చిలో సుస్మితకు గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ చేసి స్టంట్‌ వేసిన విషయం తెలిసిందే. అయితే ఏడాదికి రెండు సార్లు గుండె పరీక్షలు చేయించుకుంటున్నప్పటికీ… తనకు గుండెపోటు వచ్చింది అని చెప్పుకొచ్చింది.

గుండె నిర్మాణం, పనితీరును చెక్‌ చేసే ఎకోకార్డియోగ్రామ్‌ టెస్టులోనూ అంతా సరిగానే ఉందని రిపోర్టు వచ్చిందని, కానీ ఎందుకు తనకు గుండెపోటు వచ్చిందో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది. సుస్మిత తల్లిదండ్రులకు గుండె సమస్యలు ఉన్నాయనట, అలా జన్యుపరంగా తనకు సైతం వచ్చి ఉంటాయని అని చెప్పింది. తనకు గుండెపోటు రావడానికి 6 నెలల ముందు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నానని చెప్పిన ఆమె రిపోర్టులు బాగున్నా ఎందుకిలా జరిగిందో అర్థం కాలేదని చెప్పింది.

ఈ క్రమంలో ఇప్పుడు ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాననే అర్థంలో మాట్లాడింది సుస్మిత. ఇక ఆమె ప్రొఫెషనల్‌ విషయానికి వస్తే… సుస్మితా సేన్‌ ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఆర్య’ మూడో సీజన్‌ నవంబర్‌ 3 నుండి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ సమయంలోనే సుస్మితా సేన్‌ గుండెపోటుకు గురైంది. ఆర్య ట్రైలర్‌లో చూపించిన ఒక యాక్షన్‌ సీన్‌ సమయంలో తనకి గుండెపోటు వచ్చిందట.

అక్కడ షూటింగ్‌ ఆపేసి ఆ తర్వాత నెల రోజులకు మళ్లీ ప్రారంభించారట. వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌లో బుల్లెట్‌ తగలడంతో కిందపడి ఊపిరి తీయడానికి ఇబ్బంది పడ్డట్లుగానే నిజజీవితంలోనూ గుండెపోటుతో ఇబ్బంది పడ్డాను అని సుస్మిత చెప్పింది. తనకు ఆ దశ చీకటి కాలంలా కనిపించి అని చెప్పిన సుస్మిత (Sushmita Sen) ఆ తర్వాత జీవితం మళ్లీ ప్రారంభమైనట్లు అనిపిస్తోందని అంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus