Sushmita Sen,Lalit Modi: క్రికెట్‌ – సినిమా ఫ్యాన్స్‌కి షాక్‌ ఇచ్చిన లలిత్‌ – సుష్‌!

  • July 15, 2022 / 12:28 PM IST

బాలీవుడ్‌ – క్రికెట్‌.. ఈ రెండింటికి విడదీయరాని బంధం ఉంది అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే సినిమా హీరోలు – బాలీవుడ్‌ హీరోయిన్లు ఇలా బంధాలు ఏర్పరుచుకుంటూ ఉంటారు. కొందరికి ముడిపడితే ఇంకొందరు విడిపోతుంటారు. అయితే క్రికెట్‌ పాలనాధికారికి, హీరోయిన్‌కి రిలేషన్ ఎప్పుడూ ఊహించలేం. కానీ ఇప్పుడు అది జరిగింది. అయితే ఆయన మాజీ పాలనాధికారి, ఆమె మాజీ హీరోయిన్‌. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఇదే చర్చ. ‘ఐపీఎల్‌’ అంటే సిక్స్‌లు, ఫోర్లు గుర్తొస్తున్నాయి కానీ…

తొలి రోజుల్లో గుర్తొచ్చేది లలిత్‌ మోడీనే. ఆయన ఆలోచనల నుండి వచ్చిన ఈ పొట్టి క్రికెట్‌ ఇప్పుడు ప్రపంచంలోనే టాప్‌ లీగ్‌ అయ్యింది. అయితే ఆ తర్వాత లలిత్‌ పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌లో కేసులో దేశం విడిచి పారిపోయి 2010 నుండి లండన్‌లో ఉంటున్నారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఎందుకంటే అందులో ఉన్నది మాజీ విశ్వసుందరి, ప్రముఖ నటి సుస్మితా సేన్‌. ‘‘సుస్మితా సేన్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించాను.

ఇటీవలే మా ప్రపంచ పర్యటన కూడా పూర్తయింది’’ కొన్ని ట్రిప్‌ ఫొటోలను షేర్‌ చేశాడు లలిత్‌ మోడీ. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ వెంటనే వారు పెళ్లి చేసుకున్నారా అంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే లలిత్‌ మోడీ స్పష్టత ఇస్తూ మరో ట్వీట్‌ చేశాడు. అందులో తమ రిలేషన్‌ మీద మరింత స్పష్టత ఇచ్చాడు.

మేం ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇద్దరం డేటింగ్‌ చేస్తున్నాం అంతే. భవిష్యత్తులో పెళ్లి జరిగే రోజు కూడా జరగవచ్చు అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. దాంతోపాటు సుస్మితో దిగిన మరికొన్ని ఫొటోలను పోస్టు చేశాడు. దీంతోపాటు సుస్మితతో గతంలో కలసి దిగిన ఫొటోలను కూడా లలిత్‌ మోడీ షేర్‌ చేశాడు. ఇక సుస్మితా సేన్‌ సంగతి చూస్తే… గతంలో తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్‌ రోహ్మాన్‌ షాల్‌తో డేటింగ్‌లో ఉంది. లలిత్‌ మోడీ భార్య మినాల్‌ 2018లో చనిపోయారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus