ప్రియాంక బాటలోనే నడుస్తున్న.. సుస్మితా సేన్..!

‘కింగ్’ నాగార్జున హీరోగా వచ్చిన ‘రక్షకుడు’ చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమైంది సుస్మితా సేన్. ఆ తరువాత కొంత గ్యాప్ తర్వాత రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ‘మర్రిచెట్టు’ అనే హారర్ సినిమాలో కూడా నటించింది. 1994లో ‘మిస్ ఇండియా’, ‘మిస్ యూనివర్స్’ కిరీటాలను కూడా సొంతం చేసుకున్న సుస్మితా సేన్ అనేక బాలీవుడ్ చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అప్పట్లో ఈమె కాల్షీట్ల కోసం దర్శక నిర్మాతలు క్యూలు కట్టేవారు. స్టార్ హీరోలు సైతం ఈమెతో జతకట్టాలని ఎగబడేవారంట.

ఇది పక్కన పెడితే… 43 ఏళ్ళు వచ్చినా.. ఇంకా సుస్మిత పెళ్ళి చేసుకోలేదు. ఈ విషయం పై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. అయితే రొహ్మన్ చావల్ అనే మోడల్ తో గత కొన్నేళ్లుగా ఆమె డేటింగ్ చేస్తుందని సమాచారం. అంతేకాదు త్వరలోనే వీరిద్దరూ పెళ్ళి చేసుకునే ఆలోచనలో కూడా ఉన్నారట. ఓ ఫ్యాషన్ షోలో వీరిద్దరికి పరిచయం ఏర్పడి ఆ తరువాత అది ప్రేమగా బలపడిందట. ప్రస్తుతం వీరు విందులు, విహారాలంటూ చెట్టాపట్టాలేసుకొని తెగ తిరుగుతున్నారట. బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. నవంబర్ లో వీరిద్దరి వివాహం ఉంటుందని తెలుస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… సుష్మిత సేన్ కంటే రొహ్మన్ 14 సంవత్సరాలు చిన్నవాడు. సుస్మిత వయసు 43 అయితే రొహ్మన్ వయసు కేవలం 28 వయసు మాత్రమే. దీంతో ‘ప్రియాంక బాటలోనే సుస్మిత కూడా నడుస్తుంది’ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus