యాంకర్ శ్రీముఖికి గట్టి వార్నింగ్ ఇచ్చిన సుష్మిత
- March 9, 2017 / 07:18 AM ISTByFilmy Focus
తెలుగు యాంకర్లలో అనసూయ, రష్మీ తర్వాత శ్రీముఖికి మంచి గిరాకీ ఉంది. ఆమె చేతినిండా షోలు ఉన్నాయి. ఈటీవీ ప్లస్ లో రవితో కలిసి చేస్తున్న పటాస్ కార్యక్రమంలో ఆమె మాటలు శృతి మించుతోంది. అడల్ట్ కంటెంట్ ఎక్కువైపోతోందని విమర్శలు ఎదుర్కుంటున్న ఈ షో, శ్రీముఖి ఓవర్ యాక్షన్ వల్ల మరో వివాదంలోకి ఇరుక్కుంది. రీసెంట్ గా ప్రసారమైన ఓ ఎపిసోడ్ లో శ్రీముఖి నర్సులపై జోకులు వేసింది. దీంతో నర్సులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నర్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యదర్శి సుస్మిత మాత్రం హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో శ్రీముఖిపై కేసు పెట్టింది.
“మాది ఎంతో పవిత్రమైన వృత్తి , అలాంటిది మా వృత్తి పై సెటైర్లు వేస్తారా ? చెప్పుతో కొడతా..!” అంటూ యాంకర్ కి వార్నింగ్ ఇచ్చింది. రోగులకు ఎంతో సేవ చేస్తున్న మమ్మల్ని అవమానిస్తారా ?, మీలాంటి వాళ్ళ తో చెప్పించుకునే పరిస్థితుల్లో తాము లేమని సుస్మిత హితబోధ చేసింది. ఇప్పటికైనా షోలు సెటైర్లు, బూతులు తగ్గిస్తారేమో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













