మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ముంబై ఎయిర్ పోర్ట్ కి దగ్గరలో ఉన్న డ్రాగన్ క్లబ్ లో దాడి జరిపి.. కోవిడ్ నియమాలను ఉల్లఘించినందుకు ముంబై పోలీసులు 34 మందిని అరెస్ట్ చేశారని.. వీరిలో సురేష్ రైనా, గురు రంధావా, హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన సుసానే ఖాన్ తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. తనపై వస్తోన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఈ విషయంలో తనను కానీ క్లబ్ యాజమాన్యాన్ని కానీ సంప్రదించకుండా ఊహాగానాలు ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు.
తమ నుండి ప్రకటన వచ్చే వరకు ఆగకుండా.. ఎలాంటి ఎంక్వయిరీలు చేయకుండా.. తోచింది రాసేస్తున్నారని.. ఇలాంటి అవాస్తవాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. ఈ విషయంపై తనే స్వయంగా వివరణ ఇవ్వాలని భావించినట్లు చెప్పిన సుసానే ఇన్స్టాగ్రామ్ లో ఓ లెటర్ ని షేర్ చేశారు. గత రాత్రి ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో భాగంగా సహార్ జేడబ్ల్యూ మారియట్‌లోని డ్రాగన్ ఫ్లై క్లబ్‌కి వెళ్లామని.. పార్టీ టైమ్ఎక్స్‌టెండ్ అవ్వడంతో ఉదయం 2:30 నిమిషాల సమయంలో అధికారులు క్లబ్ లోకి వచ్చారని సుసానే రాసుకొచ్చింది.
వారు యాజమాన్యాన్ని పిలిచి కొత్త కర్ఫ్యూ నియమాల గురించి చెప్పి.. ఇప్పటివరకు ఎందుకు క్లబ్ ఓపెన్ చేసి ఉంచారనే విషయాలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. క్లబ్ లో ఉన్న వారందరినీ మరో మూడు గంటల పాటు వెయిట్ చేయమని చెప్పి.. ఉదయం 6 గంటలకు అందరినీ బయటకి పంపించినట్లు లెటర్ లో పేర్కొన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా.. మీడియాలో తను అరెస్ట్ అయ్యానంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవాలు అంటూ చెప్పుకొచ్చారు.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!